- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీఈఓ లేఖ..
నేడు జాతీయ ఓటరు దినోత్సవం. ఈరోజు భారత ఎన్నికల సంఘం స్థాపన దినం. దీని ఉద్దేశ్యం ఓటర్లుగా తమ హక్కులు, బాధ్యతల గురించి భారత పౌరులకు అవగాహన కల్పించడం. సంస్థ యోగ్యత, నిష్పాక్షికత, విశ్వసనీయతతో ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఒక్కొక్కదానికి 16 ఎన్నికలు, 399 శాసనసభ ఎన్నికలను ఈసీ నిర్వహించింది. ఇప్పుడు 400వ దఫా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ప్రతి ఓటరుకు వందనం
ఈ రోజు, జనవరి 25, భారత ఎన్నికల సంఘం స్థాపన దినం. 2011 నుండి దీనిని జాతీయ ఓటర్ల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. దీని ఉద్దేశ్యం ఓటర్లుగా తమ హక్కులు, బాధ్యతల గురించి భారత పౌరులకు అవగాహన కల్పించడం. ఎన్నికల సంఘాన్ని 1950 జనవరి 25న మొదటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థాపించారు. దాని పనితీరు, నిర్ణయం తీసుకునే స్వతంత్రతను నిర్ధారించడానికి రాజ్యాంగ సభ ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి రాజ్యాంగ హెూదాను ఇచ్చింది. తక్కువ అక్షరాస్యత, ఉనికిలో లేని ఓటర్ల జాబితా కొనసాగిన యుగంలో వయోజన ఓటు హక్కు ఆధారంగా ఎన్నికలను నిర్వహించడానికి శాశ్వత, కేంద్ర, స్వయం ప్రతిపత్తి కమిషన్‌ను ఏర్పాటు చేయడం రాజ్యాంగ సభ దూరదృష్టికి నివాళి. సంస్థ యోగ్యత, నిష్పాక్షికత, విశ్వసనీయతతో ఇప్పటివరకు 17 లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయానికి ఒక్కొక్కదానికి 16 ఎన్నికలు, 399 శాసనసభ ఎన్నికలను ఈసీ నిర్వహించింది. ఇప్పుడు 400వ దఫా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఓటుహక్కు అధికారానికి బాట
అంతర్జాతీయ అనుభవాలకు విరుద్ధంగా, భారతదేశంలో ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ వివాదంలో లేవు. వ్యక్తిగత ఎన్నికల పిటిషన్లపై సంబంధిత హైకోర్టులు తీర్పు చెబుతాయి. రాజకీయ పార్టీలు, భారతదేశ పౌరుల విశ్వాసాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పొందింది. పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి బలమైన, సమ్మిళిత ఎన్నికల భాగస్వామ్యం కీలకం. శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సక్రమంగా, విశ్వసనీయంగా ఉండాలి. పాలనపై పూర్తి బరువును మోయడానికి పాలకులు జనాదరణ కలిగి ఉండాలి. ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే అధికారమన్నారు గాంధీ. మనం మన విధులను నిర్వర్తించకుండా వదిలేస్తే, హక్కుల కోసం పరిగెడతాము. అవి ఇష్టానుసారంగా మననుంచి తప్పించుకు తిరుగుతాయి.
94 కోట్లకు పైగా నమోదిత ఓటర్లను కలిగి ఉన్న భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. గత సార్వత్రిక ఎన్నికలలో (2019) 67.4 శాతం ఓటింగ్ జరిగింది. ఈ సంఖ్య ఆశించదగినది. ఆ మిగిలిన 30 కోట్ల మంది ఓటర్లను పోలింగ్ బూత్‌కు రప్పించేలా ప్రేరేపించడమే సవాలు. ఓటర్లు ఓటు వేయకపోవడానికి పట్టణ ఉదాసీనత, యువత ఉదాసీనత, దేశీయ వలసలు వంటి అనేక అంశాలు కారణం అవుతున్నాయి. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చితే, మన దేశంలో ఓటరు నమోదు, ఓటు స్వచ్ఛందంగా వేయడానికి ఓటరును ఒప్పించే పద్ధతి సులభతరం. ఇది తక్కువ ఓటింగ్ ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని తన పనితీరును మెరుగుపరుస్తుంది.
నూరేళ్లు నిండిన ఓటర్లకు ధన్యవాదాలు
దాదాపు 80 ఏళ్ళకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెండు కోట్లకు పైగా ఓటర్లు, 80 లక్షల పీడబ్ల్యూడీ ఓటర్లు, 47,500 థర్డ్ జెండర్ వ్యక్తులను నమోదు చేయడం కోసం ఈసీఐ ఇప్పటికే వ్యవస్థలను సంస్థాగతీకరించింది. ప్రజాస్వామ్యం పట్ల వారి నిబద్ధతను గుర్తించి అభినందించడానికి నేను నూరేళ్లు దాటిన రెండులక్షల మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలిపాను. నవంబర్ 5, 2022న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని దివంగత శ్యామ్ శరణ్ నేగికి నివాళులు అర్పించే శోకపూర్వక గౌరవం నాకు లభించింది. ఆయన మొదటి సార్వత్రిక ఎన్నికలలో మొదటి ఓటరుగా గుర్తించబడిన ఓటరు. ఆయన 106 సంవత్సరాల వయసులో మరణించే ముందు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోలేదు. ఆయన మన ఓటును విధిగా వేయడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి.
యువ ఓటర్లే భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు. 2000 సంవత్సరం తర్వాత జన్మించిన తరం కూడా మన ఓటర్ల జాబితాలో చేరడం ప్రారంభించింది. ఓటర్లుగా వారి భాగస్వామ్యం మొత్తం శతాబ్దమంతా ప్రజాస్వామ్య భవిష్యత్తును రూపొందిస్తుంది. అందువల్ల విద్యార్థులు ఓటు వేసే వయస్సు వచ్చేలోపు పాఠశాల స్థాయిలో ప్రజాస్వామ్య మూలాలు బీజం కావడం చాలా క్లిష్టమైనది. ఏకకాలంలో యువతను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు వివిధ మాధ్యమాల ద్వారా వారిని అప్రమత్తం చేస్తున్నాం. పట్టణ ఓటర్ల విషయంలో కూడా అదే పాటిస్తున్నాం. కానీ వారు ఓటింగ్ వేయడానికి ఉదాసీనతను ప్రదర్శిస్తారు. ఇప్పటికే ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సౌకర్యాలు ఈసీఐ కల్పిస్తోంది.
ప్రజాస్వామ్యంలో, ఓటర్లకు తాము ఓటు వేసే అభ్యర్థుల నేపథ్యం గురించి తెలుసుకోవడానికి హక్కు ఉంది. ప్రతి రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన సంక్షేమ పథకాల వాగ్దానం అమలుచేయడానికి ప్రభుత్వ ఖజానా స్థితిగతులు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుంది.
సీ-విజిల్ యాప్‌తో తక్షణ చర్యలు
అలాగే, ఇప్పటికి ఎన్నికలకు సంబంధించిన హింస, ఓటర్ల స్వేచ్ఛా ఎంపికపై ప్రభావం చూపే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా అణిచివేసినా ఎక్కడో ఒకదగ్గర హింసాత్మక ఘటనలు జరుగుతుంటాయి. అందుకే ఎన్నికల సంఘం సీ-విజిల్ అనే యాప్‌ను ప్రారంభించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సందర్భంలో ఎవరైన ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. నేరస్థులపై 100 నిమిషాల లోపు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఇప్పటికే ఇలా కఠినమైన నిఘా కారణంగా ఇటీవల జరిగిన ఎన్నికలలో రికార్డు స్థాయిలో జప్తు జరిగింది.
సోషల్ మీడియా వాస్తవాలు, వీక్షణలతోపాటు నకిలీ వార్తలను ప్రచారం చేయగల సామర్థ్యంతో ఉంది. వేగంగా ఎన్నికల నిర్వహణలో సాంకేతికతతోపాటు ఇతర అంశాలను అధిగమించే ప్రవృత్తిని ఇది కలిగి ఉంటుంది. ప్రతి ఎన్నికలకు ముందు వందల కొద్దీ నకిలీ మీడియా వీడియోల కంటెంట్ లోడ్ చేయబడి ప్రచారం అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్‌లు తమ అపారమైన కృత్రిమ మేథా సామర్థ్యాలను కనీసం. అటువంటి తప్పుడు సమాచార ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఉపయోగించుకుంటాయనే అంచనాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. శక్తివంతమైన నకిలీలు ఎన్నికల నిర్వహణ సంస్థల పనిని మరింత కష్టతరం చేస్తాయని గ్రహించి, స్వీయ- దిద్దుబాటు అమలులోకి రావాలి.
భాగస్వామ్య ఓటరును కలుపుకుని ఎన్నికలను స్నేహపూర్వకంగా, నైతికంగా నిర్వహించడంలో ఈసీఐ తీసుకున్న సంకల్పాన్ని జాతీయ ఓటరు దినోత్సవం ప్రతిబింబిస్తుంది. పౌరులు తమ కర్తవ్యంలో భాగంగా ఓటరుగా గర్వపడుతున్నప్పుడు, దాని ప్రభావం పాలనా స్థాయిపై ఖచ్చితంగా కనిపిస్తుంది.
(నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం)
-రాజీవ్ కుమార్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
దేశంలో పెరిగిపోతున్న నపుంసకత్వం..