- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రౌండ్ రిపోర్ట్: 'ఆశాలు' ఆరోగ్య రక్షలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల తీరు అద్వానంగా ఉండేది. సర్కారు దవాఖానకు పోవాలంటే జనం భయపడిపోయేవారు. ఇక గర్భిణులు అయితే మరింత భయపడేవారు. చాలా చోట్ల సరైన సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సామాన్యులకు సర్కారు దవాఖానలు భరోసా కల్పిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవాలు పెరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో మునుపటికంటే సుమారు 22 శాతం మేర ప్రసావాలు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
సేవలు అమూల్యం
తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలు అందడానికి ఎక్కువగా కృషి చేస్తున్నది ఆశా వర్కర్లు. వారు వైద్య ఆరోగ్య శాఖలో అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆశా కార్యకర్త స్థానికంగా నివాసం ఉంటూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులకు మందులు, టీకాలు, పౌష్టికాహారం ఇవ్వడం లాంటి విధులు నిర్వహిస్తారు. సామాన్య ప్రజలలో చైతన్యం కలిగించి వారు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించుకునేలా కృషి చేస్తారు.
గర్భిణులకు మొదటి నెల నుంచి ప్రసవం వరకు వారికి కావాల్సిన టైం లో అన్ని రకాల మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయితే వచ్చే ప్రభుత్వ కిట్, అందులో ఉండే శిశువుకు కావాల్సిన వస్తువుల గురించి, ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు డబ్బులు తల్లి అకౌంట్ లో జమ చేసేలా ఉన్న పథకాల గురించి వారికి అవగాహన కలిగిస్తారు. ప్రైవేటు ఆసుపత్రులలో అవసరం ఉన్నా, లేకున్నా కూడా నార్మల్ డెలివరీ చేయకుండా సిజేరియన్ చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధ్యమయినంతవరకు నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు. బాలింత. శిశువు ఆరోగ్యానికి భరోసా కల్పిస్తారు.
కరోనా సమయంలోనూ
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆశా వర్కర్లు ఇప్పటికే ఇంటింటికి తిరిగి పెద్ద ఎత్తున 'ఫీవర్ సర్వే' చేశారు. కుటుంబాల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా తెలుసుకొని, కరోనా అనుమానితులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం, ఐసోలేషన్ సెంటర్లకు తరలించడం, కిట్లు అందించడం వీరి బాధ్యత. మాతా శిశు సంరక్షణ కోసం ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే, ప్రభుత్వ ఆదేశానుసారం కోవిడ్ బాధితులకు రాత్రనకా, పగలనకా సహాయ సహకారాలు అందిస్తూ అమ్మలా వారిని చూసుకుంటున్నారు.
కరోనా సమయంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్‌లకు కరోనా సోకినా ఆత్మస్థైర్యంతో కోలుకుని, తిరిగి విధి నిర్వహణలో భాగమయ్యారు. ఎన్ని అడ్డంకులు, ఎంత కష్టమైనా బాధ్యత మరువలేదు. ఆరోగ్యానికి సంబంధించి గ్రామ ఆరోగ్య రిజిస్టర్ మెయింటెన్ చేస్తూ, గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వివిధ వ్యాధుల మీద అవగాహన కల్పిస్తూ, బీపీ షుగర్ ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేయడం వారి కృషి వలననే.
స్థిర వేతనం కావాలి
ఇన్ని పనులు చేస్తున్న వీరికి ఇంతవరకు తక్కువ వేతనం వచ్చేది. ఇటీవల ప్రభుత్వం వారికి తీపి కబురు చెప్పింది. వేతనం 9750 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల మంది ఆశా కార్యకర్తలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతున్నది.
దాంతో పాటు కరోనా సమయంలో మహబూబ్‌నగర్‌లో ఏఎన్ఎం చనిపోతే కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రాన్ని ఆరోగ్య సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్న ఆశా కార్యకర్తల కృషిని గుర్తించి పనిని బట్టి కాకుండా, వారికి ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. వారి ఈ కోరిక నెరవేరాలని కోరుకుందాం.
చిటుకుల మైసారెడ్డి,
సీనియర్ జర్నలిస్ట్, సిద్ధిపేట
94905 24724