- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపు ఉన్నట్లా? లేనట్లా?
తెలంగాణ రాష్ట్రంలో చిన్నవి, పెద్దవి మొత్తం కలిసి 50కి పైగానే ఉపాధ్యాయ సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో ఏ సంఘానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలియడం లేదు. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఎవరూ ఫలానా సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఉందని కానీ, లేదని కానీ చెప్పడం లేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులను పరిశీలించినా సంఘాల గుర్తింపుపై స్పష్టత రావడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లా? లేనట్లా? అనే సంశయం ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపు ఉండేది. గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయబడేది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నందు కొన్ని సంఘాలకు శాశ్వత సభ్యత్వం, కొన్నింటికి రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం బాధ్యత ఉండేది. గుర్తింపు కలిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నందు సభ్యత్వం కలిగిన సంఘాల రాష్ట్ర బాధ్యులకు ఓడి సౌకర్యం, జిల్లా బాధ్యులకు 21 రోజుల ఆకస్మిక సెలవులను వాడుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కలిపించేది. అది కూడా కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపు ఇచ్చినట్లు కానీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు కానీ ఎక్కడా ఆధారాలు లేవు.
ఆ సంఘాలకు గుర్తింపు లేనప్పటికీ..
తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన మెమో సంఖ్య 63753/SW/A1/2018-1 తేదీ 08.06.2018 ప్రకారం ఆ నాటికి ఏ సంఘానికి గుర్తింపు లేదని తెలుస్తుంది. ఆ తర్వాత విడుదలైన మెమో సంఖ్య 63753/SW/A1/2018-2 తేదీ 11.06.2018 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొంది ప్రస్తుతం తెలంగాణ పేరుతో నడుస్తున్న సంఘాలన్నీ గుర్తింపు పొందినట్లుగానే భావించాలని తెలుస్తున్నది. అలానే మరో మెమో సంఖ్య 63753/SW/A1/2018-3 తేదీ 14.06.2018 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పేరుతో గుర్తింపు పొందిన సంఘాలన్నింటిని గుర్తించబడినట్లుగానే పరిగణించాలని తెలుస్తున్నది. కానీ ఈ రెండు మెమోలకు భిన్నంగా ఆ తర్వాత ప్రభుత్వం వివిధ సందర్భాల్లో సంఘాల రాష్ట్ర ప్రధాన బాధ్యులకు ఓడి సౌకర్యాన్ని కలిపిస్తూ ఇచ్చిన పలు ఉత్తర్వులు GO Rt. No. 2069 తేదీ 03.11.2022, GO Rt. No. 2369 తేదీ 19.11.2022, GO Rt. No. 2285 తేదీ 3.12.2022 మరియు GO Rt. No. 2302 తేదీ 5.12.2022లలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటును, సంఘాల గుర్తింపును పెండింగ్‌లో పెట్టినట్లుగా చెప్పబడింది. ఈ పలు ఉత్తర్వుల ద్వారా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు కాలేదని, సంఘాలకు గుర్తింపు ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తున్నది. అయినా కొన్ని ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రధాన బాధ్యులు 21 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులను వాడుకుంటున్నారు. ఒక్కో జిల్లాలో కనీసం ఐదు సంఘాల బాధ్యులు (5 X2 = 10 మంది) 21 రోజుల చొప్పున (10 X 21 = 210 రోజులు) 33 జిల్లాల్లో (33 X 210) 6930 రోజుల ఆకస్మిక సెలవులు వాడుకునే అవకాశం ఉంది. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా సొంత పనులకు వాడుకుంటున్నారనే అభిప్రాయం లేకపోలేదు. గుర్తింపు లేకపోతే ఇలా వాడుకోవడం సి అండ్ డి ఎస్ ఇ లేఖ సంఖ్య 572/C2-2 /96 తేదీ 10.10.1997 కు విరుద్ధం. ఒక విద్యా సంవత్సరంలో ఇన్ని పని దినాలను కోల్పోవడం బోధనాభ్యసన కార్యక్రమాలకు పెద్ద నష్టమనే చెప్పాలి.
సమాచారం కోరినా.. వివరణ లేదు
జనగామ జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల జిల్లా బాధ్యులు కొందరు గత కొన్ని సంవత్సరాలుగా 21 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు వాడుకుంటున్నారని, అలా వాడుకునే అవకాశం వారికి లేదని డి టి ఎఫ్ జనగామ జిల్లా శాఖ జిల్లా విద్యాశాఖాధికారి గారికి తేదీ 05.03.2020 న ఒకసారి, తేదీ 07.09.2021 న మరోసారి ప్రాతినిధ్యం చేసింది. జిల్లా విద్యాశాఖాధికారి ఒకసారి ఆర్‌జేడి హైదరాబాద్ గారికి, మరోసారి సి అండ్ డి ఎస్ ఇ హైదరాబాద్ గారికి ఉపాధ్యాయ సంఘాల గుర్తింపుపై వివరణ కోరుతూ లేఖలు రాశారు. అయితే, ఆర్‌జేడి నుండి కానీ, సిఅండ్‌డిఎస్‌ఇ నుండి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. ఉపాధ్యాయ సంఘాల గుర్తింపు, జిల్లా బాధ్యులు ప్రత్యేక ఆకస్మిక సెలవులు వాడుకోవడంపై వివరణ కావాలని డీటీఎఫ్ రాష్ట్ర కమిటీ కూడా ప్రభుత్వ కార్యదర్శి గారికి ప్రాతినిధ్యం చేయగా వారు 36 జీవోలను, మెమోలను కోడ్ చేస్తూ మెమో నెం. 8988/SE.Gen.I’ll/22 తేదీ. 26.10.2022 ద్వారా సి అండ్ డి ఎస్ ఇ తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల లిస్టుతో పాటు గుర్తింపు ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఇవ్వాలని డిటిఎఫ్ జనగాం జిల్లా కమిటీ సి అండ్ డి ఎస్ ఇ హైదరాబాద్ గారికి సమాచార హక్కు చట్టం క్రింద దరఖాస్తు చేసినా జవాబు రాలేదు. మొత్తానికి ఉపాధ్యాయ సంఘాల ప్రభుత్వ గుర్తింపును తేల్చాల్సిన బాధ్యత సి అండ్ డిఎస్ఇ పై పడింది. సి అండ్ డి ఎస్ ఇ గారు ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని చెప్తారో.. ఇవ్వలేదని చెప్తారో చూడాలి. ఒకవేళ ఉపాధ్యాయ సంఘాలకు గుర్తింపు లేదని, తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని చెపితే, గత కొన్నేళ్ళుగా గుర్తింపు కలిగిన సంఘాల జిల్లా బాధ్యులుగా వాడుకున్న ప్రత్యేక ఆకస్మిక సెలవులను ఏం చేస్తారో చూడాలి.
రావుల రాజేశం
సామాజిక కార్యకర్త
7780185674