- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అర్హత లేకున్నా పర్మినెంటా?
‘పండు పండితే దానికదే రాలుతుంది. పాపం పండితే అంతే’. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలు పండుగా మారి ఒక్కోటిగా రాలుతుంది. అందులో మొదటిది కాళేశ్వరం ప్రాజెక్టు, రెండోది కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేయడం.
ఎన్నికల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద కుంభకోణం అని తరచుగా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తే విన్నాం. ఓ ప్రాజెక్టు నాసిరకంగా ఉంటే మళ్లీ పునః ప్రతిష్టాపన చేసుకునే వీలుంటుంది. కానీ, విద్యా వ్యవస్థలో చీడపురుగులు దూరితే విద్యార్థులు కోల్పోయే భవిష్యత్‌ను తిరిగి ఇవ్వలేం. అందుకే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలలో జరిగిన అవకతవకలు కాళేశ్వరంను మించిన పెద్ద స్కామ్. ఆ ప్రాజెక్టు లోపం కళ్లకు కనిపిస్తుంది. కానీ ఈ విద్యా విధాన లోపం కళ్లకు కనిపించనిది. కాళ్లకు సంకెళ్లు వేస్తుంది.
నకిలీ అర్హతలతో..
చంద్రబాబు హయాంలో కాంట్రాక్ట్ (అవుట్ సోర్సింగ్ జాబ్స్) ఉద్యోగాలకు తెరలేపడంతో విద్యా వ్యవస్థలోనూ (జూనియర్, డిగ్రీ, పాలిటెక్నీక్) కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకులు నియమితులు అయ్యారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయని నాటి చంద్రబాబు సర్కార్.. కాంట్రాక్ట్ (అవుట్ సోర్సింగ్ జాబ్స్ ) పద్ధతిన తక్కువ వేతనంతో పని చేసేందుకు అధ్యాపకులను రిక్రూట్ చేసుకుంది. ఆ పరంపర తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. తాను దిగిపోయే సమయానికి వాళ్ళను రెగ్యులరైజ్ చేశారు. అయితే వాళ్ళలో చాలామందికి కనీస అర్హతలు లేవు. కొత్తగా జేఎల్, డీఎల్, పాలిటెక్నిక్ పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్షలు నిర్వహించని బీఆర్ఎస్ ప్రభుత్వం..ఈ నియామక ప్రక్రియను ఆయా కాలేజ్ ప్రిన్సిపాల్స్‌కు అప్పగించడంతో ముడుపులు తీసుకుని తమ సంబంధీకులను, బంధువులను, ఒప్పంద అధ్యాపకులుగా నియమించుకున్న పరిస్థితి ఉన్నది. వారికి కనీస అర్హత లేదు. విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా లేవు. ఎప్పుడైతే బీఆర్ఎస్ సర్కార్, కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసే పక్రియను షురూ చేసిందో, అప్పుడే డిగ్రీ ఒప్పంద అధ్యాపకులు నకిలీ పీహెచ్‌డీ పట్టా సంపాదించి అన్ని అర్హతలు సృష్టించారు. ఇదే ప్రభుత్వ జూనియర్ కాలేజీ అధ్యాపకుల విషయంలోనూ జరిగింది. దీనిపై అప్పటి ఓ మంత్రికి, ప్రైవేట్ వర్సిటీ నడుపుతున్న ఓ ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేని వారిని రెగ్యులరైజ్ చేయడంపై నిరుద్యోగులు, ఓయూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ఈ నియామకాలను రద్దు చేయాలనీ హైకోర్టు తీర్పునిచ్చినా, సర్కార్ ఆ తీర్పును పెడచెవిన పెట్టింది. నిబంధనలను బేఖాతరు చేస్తూ ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసింది.
ఓట్ల కోణంలో ఆలోచించి..
అయితే వారిలో కొంతమంది నకిలీ ధ్రువీకరణ పత్రాలతో అధ్యాపక వృత్తిలో చేరినట్లు తేలినా అధికారులు సైతం మిన్నకుండి పోతున్నారు. నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ నకిలీపత్రాలతో కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజ్ అయినట్లు తేలింది. అయినా ఇంటర్ బోర్డు అధికారుల చర్యలు లేవు. హాస్యాస్పదం ఏంటంటే.. రిటైర్ అయిన వారిని కూడా ఈ రెగ్యులరైజ్ చేసిన వారి జాబితాలో చేర్చడం. అర్హత లేని అధ్యాపకుల బోధనలతో విద్యార్థులు ప్రతిభావంతులు ఎలా అవుతారు? కొత్త తరం కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు ఎలా పూనుకుంటుంది? ఇలా విద్యా వ్యవస్థపై సర్కార్ నిర్లక్ష్యం, అర్హత లేని అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడం వలన మంచి నీళ్ల పైప్‌లోకి డ్రైనేజీ వాటర్ వదిలినట్లు అయింది. ప్రభుత్వం ఓట్ల కోణంలో ఆలోచించి కాంట్రాక్ట్ అధ్యాపకులను మొత్తంగా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన చేసిండొచ్చు. కానీ, ఇలా ఈ నిర్ణయం వలన కొన్ని తరాల విద్యార్థులు తమ విలువైన భవిష్యత్‌ను కోల్పోతారనే ఆలోచన చేయలేకపోయింది. అనుభవం లేని వ్యక్తిని మంత్రిగా కూర్చోబెట్టి విద్యా వ్యవస్థ విధ్వంసానికి రాష్ట్రాన్ని కేరాఫ్‌గా మార్చారు. కొత్త ప్రభుత్వమైనా దొడ్డిదారిన రెగ్యులరైజ్ అయిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించే చర్యలకు పూనుకొని భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను తిరిగి గాడిన పెడుతుందని విశ్వసిస్తున్నాం.
ప్రశాంత్ పగిళ్ల
ఓయూ విద్యార్థి
95812 62429