- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రగతిశీల శక్తులకు ఆశాజ్యోతి
ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ యూనివర్శిటీ హైదరాబాద్‌లో 2022-2023 గుర్తింపు పొందిన విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలోని వామపక్ష, సామాజిక శక్తుల కూటమి జిఎస్‌కాస్... ప్యానెల్‌తో సహా ప్రధాన ఆఫీస్ బేరర్స్ పోస్టులను భారీ మెజారిటీతో కైవసం చేసుకోని ఎస్ఎఫ్ఐ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలు గతంలో 2019లో జరిగాయి. మళ్లీ మూడున్నర యేండ్ల తర్వాత ఇప్పుడు జరిగాయి. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ కూల్చుతున్న ఈ సమయంలో హెచ్‌సీయూలో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సామాజంలోని ప్రగతిశీల శక్తులకు ఆశాజ్యోతిని అందించింది. ఈ కూటమికి అన్ని వర్గాల విద్యార్థులు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. అన్ని పోస్టులను సుమారు 600 పైగా ఓట్ల మెజారిటీతో గెలుచుకుంది ఎస్ఎఫ్ఐ. ఈ ఎన్నికల్లో ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ విభాగమైన ఎబీవీపీ ని ఓడించాలని అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐకి పూర్తి మద్దతునిచ్చారు. ఈ కూటమికి సామాజికంగా అట్టడుగున ఉన్న ఓబిసి, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారు. యూనివర్సిటీ చరిత్రలోనే ఇద్దరు దళితులను ఈ కూటమిలో ప్రధాన పోస్టులలో పోటీకి ఉంచింది. అలాగే మొట్టమొదటి సారి జనరల్ సెక్రటరీగా మహిళ గెలిచింది.
అన్ని వర్గాలు ఈ కూటమి విజయానికి తమ మద్దతును తెలియజేయడానికి కారణం యూనివర్శిటీలో సమస్య ఏదైనా వస్తే ఆ సమస్యపై పోరాటం చేసేది ఎస్ఎఫ్ఐ కూటమే. యూనివర్సిటీ సమస్యలే కాకుండా దళిత, మైనార్టీల సమస్యలైన సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి బహిరంగంగానే మద్దతు ప్రకటించి సంఘీభావంగా కార్యాచరణ తీసుకుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసింది. అలాగే విద్యా వాణిజ్యకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే యూనివర్సిటీల స్వతంత్రను ధ్వంసం చేసే నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని బలమైన ఉద్యమాలు నిర్వహించింది. అలాగే మైనార్టీలకు ఇచ్చే మౌలానా అబ్దుల్ కలాం ఫెలోషిప్ రద్దును వ్యతిరేకించింది. అనేక రూపాలలో యూనివర్శీటీ నిధుల కోత గురించి విద్యార్థులకు తెలిసేలా చేసింది. అయితే ఈ ఎన్నికలకు ఎబీవీపీకి అనుకూలంగా అడ్మినిస్ట్రేషన్‌లో ఉండి ఎన్నో ఆటంకాలు కల్పించిన నాలుగు ప్యానెల్లు పోటిలో ఉన్నా విద్యార్థులు ఎస్ఎఫ్ఐ కూటమికే మద్దతు తెలిపారు. ఈ అసమాన విజయాన్ని అందించిన వారికి జేజేలు.
టి.నాగరాజు
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి,
94900 98292