- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనిల్ అంబానీకి సమన్లు!
దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సమన్ల బెడద తప్పట్లేదు. తాజాగా యెస్ బ్యాంకు వ్యవహారంలో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపించింది. రిలయన్స్ గ్రూప్ రూ. 14,000 కోట్ల రుణాలను యెస్ బ్యాంకు నుంచి పొందింది. ఈ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారడంతో ఈ అంశంపై ప్రశ్నించేందుకు ఈడీ సమన్లు ఇచ్చింది. అయితే, అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యేందుకు వీలు కాదనీ, ఆరోగ్యం సరిగా లేదని, కొంత గడువు కావాలని కోరారు.
ఈ నెల మొదటివారంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో అనిల్ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్, ఐఎల్&ఎఫ్ఎస్, వొడాఫోన్, డీహెచ్ఎఫ్ఎల్, సీజీ పవర్ సంస్థలకు యెస్ బ్యాంకు ఇచ్చిన ఋణాల వసూళ్లలో సమస్యలు వస్తున్నాయని అన్నారు. దీంతో ఈడీ, అనిల్ అంబానీని ప్రశ్నించేందుకు సిద్ధమైంది. నిరర్ధక ఆస్తుల కారణంగా సంక్షోభంలోకి వెళ్లిన యెస్ బ్యాంకును ఆదుకునేందుకు కొన్ని ప్రైవేట్ బ్యాంకులు పెట్టుబడులు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. దీంతో సోమవారం యెస్ బ్యాంకు షేర్ ధర ఏకంగా 31 శాతానికి పైగా ఎగిసింది.