చైనా బెట్టింగ్ యాప్‌లపై ఈడీ కొరడా..

by Shamantha N |   ( Updated:2020-08-29 10:25:11.0  )
చైనా బెట్టింగ్ యాప్‌లపై ఈడీ కొరడా..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ED) సోదాలు జరుపుతోంది. ఢిల్లీ, గురుగామ్, ముంబై, పుణెలో 15 చోట్ల సోదాలు నిర్వహించగా.. నాలుగు HSBC బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.47కోట్లు నగదును ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ దాడుల్లో 17 హార్డ్‌డిస్క్‌లు, 5 ల్యాప్‌ట్యాప్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదివరకు హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసుల ఆధారంగా ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కామర్స్ పేరుతో నడుస్తున్న వందలాది బెట్టింగ్ సైట్లను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే డాకీ పే కంపెనీ ఏడాదిలోగా రూ.1268 కోట్ల లావాదేవీలు దర్యాప్తులో వెల్లడైంది. దేశంలోని చార్టడ్ అకౌంటెట్ల సహకారంతో చైనీయులు భారత్‌లో కంపెనీలు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది. వీటిలో మొబైల్ వాలెట్లతోనే ఎక్కువ లావాదేవీలు జరిగినట్లు అధికారులు ధృవీకరించారు. ఆన్ లైన్ వ్యాలెట్ సంస్థలు, హెచ్‌ఎస్‌బీసీ ఆర్వోసీల నుంచి ఈడీ ప్రస్తుతం వివరాలు సేకరిస్తోంది. కాగా, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఈడీ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed