ముమైత్ ఖాన్ ను విచారిస్తోన్న ఈడీ..

by Sumithra |   ( Updated:2021-09-15 02:36:11.0  )
ముమైత్ ఖాన్ ను విచారిస్తోన్న ఈడీ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతోన్న ఈడీ దర్యాప్తులో సినీ ప్రముఖులను ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో వారి బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ డేటాను పరిశీలించిన ఈడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు పూరి జగన్నాథ్, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌, నవదీప్‌లను విచారించిన ఈడీ నేడు ముమైత్ ఖాన్ ను విచారిస్తున్నారు. అయితే ఈడీ ఆఫీసుకు ముమైత్ నవ్వుకుంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈడీ అధికారులు సూచించిన డాక్యుమెంట్స్ తో ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ముమైత్ కు డ్రగ్ డీలర్ కెల్విన్‌తో ఉన్న పరిచయాలపై ఆమెను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్‌, మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ముమైత్ ఖాన్ ను ఈడీ విచారిస్తోందని సమాచారం.

Advertisement

Next Story