ఈడీ విచారణకు హాజరైన మెహబూబా ముఫ్తీ తల్లి

by Shamantha N |
ఈడీ విచారణకు హాజరైన మెహబూబా ముఫ్తీ తల్లి
X

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తల్లి గుల్షాన్ నజీర్ బుధవారం శ్రీనగర్‌లోని ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ ముందు మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. కాగా ఆమె వయస్సు 70 సంవత్సరాలు. కూతురితో కలిసి ఆమె శ్రీనగర్‌లోని సివిల్‌ లైన్ ఏరియాలో ఉన్న ఈడీ కార్యాలయానికి వచ్చారు. కూతురు మెహబూబా ముఫ్తీ కాలంలో సీఎం విచక్షణ నిధి నుంచి కొన్ని ఫండ్స్ వేరే ఖాతాల ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తూ బదిలి చేయబడ్డాయని ఈడీ గుర్తించింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు.. ముఫ్తీతో సన్నిహితంగా ఉన్న నలుగురిపై దాడి చేసి కొన్ని కీలక డైరీలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం వాటి ఆధారంగానే ఈ విచారణ ప్రారంభించారు. గుల్షాన్ నజీర్ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు నిరసిస్తూ మూడు సార్లు మాట్లాడినందుకు కక్ష కట్టారని పీడీపీ పార్టీ ఆరోపిస్తోంది. అందువల్లే మనీలాండరింగ్ పేరిట తమపై కేసులు నమోదు చేశారని కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పిస్తోంది.

Advertisement

Next Story