తెలంగాణ ప్రభుత్వ అధికారులపై ఈసీ సీరియస్

by Shyam |   ( Updated:2021-12-07 08:24:35.0  )
Central Electoral Commission
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వ అధికారులు జీవో విడుదల చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేయాలని సీఎస్‌ను ఆదేశించిన ఎన్నికల సంఘం.. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుతూ జీవో ఇవ్వడం కోడ్ ఉల్లంఘించడమే అని ఈసీ పేర్కొంది. జీవో విడుదల చేసిన పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Next Story