పవన్‌కు ఈసీ నోటీసులు

by Shyam |
pawan
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణికి పవన్ మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా సురభి వాణికి మద్దతు ప్రకటించడంపై ఈసీ సీరియస్ అయింది.

ఈ మేరకు పవన్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సమాధానం ఇవ్వాలని కోరింది. అటు టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై తెలంగాణ బీజేపీ వర్గాలు పవన్‌పై మండిపడుతున్నాయి. తమతో పొత్తులో ఉండి టీఆర్‌ఎస్‌కు ఎలా మద్దతు ఇస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed