- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జాతీయ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 9న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్, 12న కౌంటింగ్ ను నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటన జారీ తేది నుంచి ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఉప ఎన్నిక ఈ ఏడాది ఎప్రిల్ 7న నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. కాగా నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడింది. దీంతో మార్చి 12న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడదల చేసిన విషయం విదితమే. అదే నెలలో నామినేషన్లను స్వీకరించగా అధికార టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్ కర్ లక్ష్మి నారాయణలు నామినేషన్ లను దాఖలు చేశారు.