- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నాకు టైం వస్తుంది రెడీగా ఉండు హరీశ్.. ఈటల షాకింగ్ కామెంట్స్
దిశ ప్రతినిధి, మెదక్ : ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీశ్ రావు గర్వానికి హుజురాబాద్ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గురువారం హైదరాబాద్‌కు పయనమైన సమయంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి, రంగంధాంపల్లి, గజ్వేల్లో బీజేపీ నాయకులు ఈటలకు ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట రంగధాంపల్లిలో అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈటలకు సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌ను సిద్దిపేట ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. తెలంగాణ కోసం సిద్దిపేట పిడికిలెత్తితే సంబురపడ్డది, సంఘీభావం తెలిపింది. ఆ నినాదాన్ని తెలంగాణ ప్రజలందరూ భుజం మీద ఎత్తుకొని రాష్ట్ర సాధనలో కదంకదం కలిపి రాష్ట్రం తెచ్చుకున్నాము. కానీ, నేడు సిద్దిపేట ప్రజలు హరీశ్ రావును గెలిపిస్తే ట్రబుల్ షూటర్ పేరిట ఎక్కడ పడితే అక్కడే ఎన్నికల ఇంఛార్జీగా వస్తున్నారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా, గ్రామాలను దత్తత తీసుకుంటా, నియోజక వర్గాన్ని, గ్రామాలను సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తానని మాట్లాడుతున్నారు. ఇదంతా ఎట్లా సాధ్యమైతది.. తెలివి ఆయనకే ఉందని అనుకుంటన్నాడు.
తెలంగాణ ప్రజలు తాను ఏది చెప్పినా నమ్ముతారని ఏ గర్వంతో ఇవన్నీ చెప్పాడో.. ఆ గర్వాన్ని, ముల్లును హుజురాబాద్ ప్రజలు తమ తీర్పుతో తిప్పికొట్టారని అన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని.. జ్ఞానోదయం కల్గించుకొని ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని ఈ గడ్డ నుండి హెచ్చరిస్తున్నానని ఈటల అన్నారు. అధర్మం, అన్యాయం పక్షాన ప్రజల గొంతును నొక్కడంలో ధర్మాన్ని పాతరేయడానికి, ప్రజాస్వామ్యాన్ని చంపడానికి, మానవ సంబంధాలను తుంచడానికి హరీశ్ రావు చేస్తున్న ప్రయత్నం అనేక సందర్భాల్లో జరిగింది. కానీ హుజురాబాద్‌లో మాత్రం ప్రజలు దాన్ని తిప్పికొట్టారు.
ఈటల నినాదాలతో మార్మోగిన ఎంపీ ఆఫీస్.. సన్మానించిన బండి సంజయ్
హుజురాబాద్ ఎన్నికల్లో మంత్రి హరీశ్.. డబ్బులు, మద్యాన్ని, కుట్రలకు పాల్పడ్డారో వాటికే ఆయనే బలయ్యే రోజులు తొందరలోనే వస్తాయని జోస్యం చెప్పారు. ఆయన నియోజకవర్గంలో ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. వీరికి అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి, ప్రజలను చల్లగా చూసుకోవడానికి కానీ దౌర్జన్యం చేయడానికి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితబంధును కేవలం హుజురాబాద్‌లోనే కాదు.. తెలంగాణ రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ మరో ఆసక్తికర కామెంట్ చేయడం విశేషం. సిద్దిపేటలో కూడా దళిత గర్జన సభ పెట్టే రోజు వస్తుందని అన్నారు. ఆ రోజున సభకు తానే నాయకత్వం వహిస్తానని ఈటల ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీజేపీ నేతలు, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.