కులాన్ని బట్టి విలువ ఇచ్చే వ్యక్తి కేసీఆర్.. ఈటల షాకింగ్ కామెంట్స్

by Sridhar Babu |
eatala-rajender
X

దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వాడి.. వేడిగా ఉంది. గెలుపుపై అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటి నుంచే ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నిక లేకపోతే కేసీఆర్ ఫాంహౌస్ దాటి వచ్చేవాడా అని ప్రశ్నించారు.

దళితులపై కేసీఆర్‌ మొసలి కన్నీళ్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను ఎప్పుడూ అవమానించే వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఘూటు వ్యాఖ్యలు చేశారు. కులాన్ని బట్టి విలువ ఇచ్చే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. CMO ఆఫీసులో దళిత, గిరిజన ఆఫీసర్ ఒక్కరూ కూడా లేరని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాలో అరశాతం ఉన్న వాళ్లకే కేబినెట్‌లో అన్ని పదవులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. కరోనా సమయంలో వైద్యశాఖలో వసతులు పెంచాలని నేను మంత్రిగా ఉన్న సమయంలో ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు.

Advertisement

Next Story