హరీశ్ రావు ఇలాఖాలో వివాదాస్పదంగా ‘ఈటల’ ఫ్లెక్సీ..

by Shyam |
Chinna-kodur-Eatala-Flexi
X

దిశ ప్రతినిధి, మెదక్ : తెలంగాణ కేబినెట్‌లో ఈటల రాజేందర్ ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, గత నెలన్నర క్రితం కొన్ని భూ కబ్జా ఆరోపణలతో అధిష్టానం ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అయితే, ఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ అందించిన సేవలపై రూపొందించిన ఫ్లెక్సీలు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి.

ఆరోగ్య మంత్రిగా ఆయన్ను బర్తరఫ్ చేసినా.. ఇంకా ఈటల రాజేందర్ ఫోటో కనిపించడమేంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇదెక్కడో అనుకుంటున్నారా.. సిద్దిపేట జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చిన్నకోడూరు మండల పీహెచ్‌సీలో ఉంది. చిన్నకోడూరు మండల పీహెచ్‌సీలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెళ్లగా అక్కడ వైద్యశాఖకు సంబంధించిన సమాచార ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కనిపించడంతో వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీనిపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఈటల బర్తరఫ్ అయి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ఫ్లెక్సీలు తొలగించరా అంటూ ఫోటో షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story