‘కేటీఆర్ అయినా ఈటల తర్వాతనే’.. జమున సంచలన వ్యాఖ్యలు

by Sridhar Babu |   ( Updated:2021-07-08 05:12:27.0  )
‘కేటీఆర్ అయినా ఈటల తర్వాతనే’.. జమున సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కమలాపూర్: కేటీఆర్ అయినా ఈటల రాజేందర్ తర్వాతనే అంటూ.. ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూనిపర్తి గ్రామంలో గురువారం ఈటల సతీమణి జమున రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు ఈటల రాజేందర్‌ను ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. పేదలకు కష్టం వస్తే వారికి ఈటల మాత్రమే గుర్తుకొస్తారన్నారు. చివరకు సీఎం కొడుకు అయిన సరే ఈటల తర్వాతే అని ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పుకొచ్చారు. అటువంటిది హుజురాబాద్‌ పర్యటనకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అనవసర ఆరోపణలకు చెక్‌ పెడుతూ.. త్వరలోనే నియోజకవర్గ ప్రజలు ఈటలను గెలిపించుకుంటారని జమున ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed