- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీదీ.. ఏందిది..?
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ అయింది. ఈ నెల 1న నందిగ్రామ్ ఎన్నికల రోజున ఓ పోలింగ్ బూత్‌లో ఆమె వ్యవహరించిన తీరుపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్ బూత్ కేంద్రం వద్దకు వెళ్లడం.. అక్కడ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేగాక సుమారు రెండు గంటల పాటు పోలింగ్ కేంద్రంలోనే ఆమె ఉండటాన్ని కూడా ఈసీ తప్పుబట్టింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకమని తెలిపింది.
నందిగ్రామ్‌లోని పోలింగ్ బూత్ వద్ద దీదీ ప్రవర్తన ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేసే ఆస్కారం లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా వ్యవహరించిన అభ్యర్థి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం గమనార్హమని తెలిపింది. దీనిని తీవ్ర పొరపాటుగా ఈసీ పరిగణిస్తున్నది. పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఆమె స్వదస్తూరితో రాసిన లేఖ కూడా.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుని రాసినట్టుగా ఉందని ఈసీ తెలిపింది. లేఖలో ఆమె చేసిన ఆరోపణలు కూడా నిరాధారమని పేర్కొంది. దీనిని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని.. నిజమైతే చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
ప్రజా ప్రతినిధ్య చట్టంలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం.. పోలింగ్ బూత్‌లో కానీ, దానికి సమీపంలో కానీ అనుచితంగా ప్రవర్తించినవారికి జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధించడానికి ఆస్కారం ఉంది.