తూ.గో. జిల్లాలో చీమలు కూడా కదలట్లేదు!

by srinivas |
తూ.గో. జిల్లాలో చీమలు కూడా కదలట్లేదు!
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ఆ స్థాయిలో విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రెండో జిల్లా తూర్పుగోదావరి జిల్లా కావడం విశేషం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 5,564 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆదివారం కఠిన కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించింది.

ఆదివారం సెలవు కావడంతో అత్యవసర సర్వీసులు మినహా ఇతర ఏ రకమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలు లేదని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ప్యూ విధిస్తున్నామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ఎపిడమిక్ డిసీజ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో జిల్లా మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఎక్కడికక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే బడితెపూజ చేస్తున్నారు. అయితే కరోనాపై అవగాహన కలగడంతో బయటకు వచ్చేందుకు స్థానికులు కూడా వెనకడుగు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed