పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం

by vinod kumar |
పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
X

ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని కురిళ్ ద్వీపాల స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం భారీ భూకంపం సంభ‌వించింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా భూభౌతిక విజ్ఞాన‌కేంద్రం వెల్లడించడమే కాకుండా, సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 7.8గా న‌మోద‌య్యింద‌ని అమెరికా నేష‌న‌ల్ ఓషియానిక్‌, అట్మాస్ఫియ‌రిక్ అడ్మినిస్ర్టేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. భూకంప కేంద్రం కురిళ్‌లోని సెవెరో ప‌ట్ట‌ణానికి ఆగ్నేయ దిశ‌లో 218 కిలోమీట‌ర్ల దూరంలో ఉంద‌ని వెల్లడించారు. దీని కార‌ణంగా విధ్వంస‌క‌ర‌మైన సునామీ ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని, అది హ‌వాయ్, మిడ్‌వే, ఉత్త‌ర మెరియ‌నాస్‌, వేక్ దీవుల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించింది. జ‌పాన్‌, ర‌ష్యా తీరాలకు కూడా దీని వలన న‌ష్టం క‌లుగ‌వ‌చ్చ‌ని అంచనా వేసింది. సునామీ కార‌ణంగా అల‌లు సాధార‌ణం కంటే 0.3 మీట‌ర్ల ఎత్తుకు ఎగిసిప‌డే అవ‌కాశం ఉంద‌ని స్పష్టం చేసింది. అయితే, జ‌పాన్ సునామీ హెచ్చ‌రిక‌ల కేంద్రం మాత్ర భూకంపం వలన పెద్ద ప్ర‌మాద‌మేమీ ఉండబోదని తెలిపింది.

tags : earthquake in pacific ocean, richter scale 7.5, danger,tsunami final call

Advertisement

Next Story

Most Viewed