- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్ ….ఫ్లాష్… నల్లమలలో కంపించిన భూమి
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో సోమవారం తెల్లవారుజామున భూమి కంపించింది. స్థానిక ప్రజలు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అచ్చంపేట, లింగాల మరియు అమ్రాబాద్ మండలాలలో సోమవారం తెల్లవారుజామున 5 నుంచి 5:30 గంటల లోపు ప్రాంతంలో భూమి కంపించిందని స్థానిక ప్రజలు తెలిపారు. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. భూమి కదలికతో మెలకువగా ఉన్న వారు ఏం జరుగుతుందోనని ఇంటి నుండి బయటికి పరుగులు తీశారు.
అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో తెల్లవారుజామున ఐదు రెండు నిమిషాలకు భూమి కదలిక 2 సెకండ్లు కనిపించిందని, ముందు బయట ఉరుములతో కూడిన పెద్ద శబ్దం వినిపించిందని ఉప సర్పంచ్ ఆలూరి కర్ణ బాబు తెలిపారు. అలాగే అచ్చంపేట పట్టణంలో ఐదు 20 నిమిషాల సమయంలో భూమి కంపించిందని, బయట పెద్ద శబ్దం వినిపించిందని, బయటికి వెళ్లి చూడగానే ఏమి కనిపించలేదని మహబూబ్ అలీ అనే వ్యక్తి తెలిపాడు.