- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్@7.. నాట్ గుడ్
దిశ, వెబ్‌డెస్క్ : పొద్దున్నే ఏడు గంటలకే చదువు మొదలుపెడుతున్నావ్..సాయంత్రం ట్యూషన్‌కు కూడా వెళ్తున్నావ్..అయినా అత్తెసరు మార్కులే ఏంటని ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను తిడుతుంటారు. అయితే కరోనా పాండమిక్‌లో స్కూల్‌కు వెళ్లే పరిస్థితి లేదనుకోండి. కానీ, ఇవాళో రేపో అవి కూడా స్టార్టవుతాయి కాబట్టి మళ్లీ ఏడు గంటలకే నిద్రలేవడాలు, రాత్రి ట్యూషన్‌కు వెళ్లడాలు కామన్ అయిపోతాయి. ఇంత చేస్తున్నా పిల్లలు చదవడానికి ప్రాబ్లమ్ ఏంటని అనిపించవచ్చు. కానీ, అసలైన ప్రాబ్లమ్ పొద్దున్న ఏడు గంటలకు స్కూల్‌లు మొదలు పెట్టడంలోనే ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే..ఫోన్‌కు అలవాటు పడిపోయింది. సోషల్ మీడియాకు అట్రాక్ట్ అయిపోయింది. పొద్దున ఏడు గంటలకే స్కూల్ ఉన్నా..రాత్రి ఒకటి రెండు గంటల దాకా ఫోన్‌లో వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ లేట్ నైట్ పడుకుంటున్నారు. దీంతో నాలుగు గంటలు మాత్రమే నిద్ర పోతున్నారు పిల్లలు. స్కూల్‌లు ప్రారంభమయ్యాక తల్లిదండ్రులు వాళ్లను పంపిస్తారు. ఇన్నాళ్లు మూసి ఉన్నాయి కాబట్టి సిలబస్ త్వరగా పూర్తిచేయాలన్న ఉద్దేశంతో దాదాపు ఏడు గంటలకే స్కూల్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ, రాత్రి సరిగా నిద్రపోని పిల్లలు క్లాస్ రూమ్స్ లోనే పడుకుంటారు. ఈ కారణంగా పిల్లలు మానసికంగా, శారీరకంగా కూడా అనారోగ్యం పాలవుతారని సైంటిస్ట్ డాక్టర్ పాల్ కెల్లీ అంటున్నారు.
ఎర్లీ మార్నింగ్ స్కూల్స్ ఎఫెక్ట్ గమనించిన నిపుణులు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో స్కూల్స్ 10కి ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్లీప్ స్కూల్ అనే సంస్థ ఏర్పాటు అయింది. ఈ సంస్థ కొన్ని స్కూల్స్‌ను, పిల్లలను సెలెక్ట్ చేసి. దాదాపు రెండేళ్లు అబ్జర్వ్ చేసింది. ఏడింటికి స్టార్ట్ అయ్యే స్కూల్ పదింటికి స్టార్ట్ చేసి, పిల్లల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో చూపించింది. ఈ ప్రయోగం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా మారడం మాత్రమే కాదు, అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగిందని రుజువు చేశారు. దీన్ని బేస్ చేసుకుని అమెరికా, బ్రిటన్ లో పది గంటలకు స్కూల్స్ స్టార్ట్ కావాలని డిమాండ్ కూడా ప్రారంభమైంది. మరి స్కూల్‌లు ప్రారంభం కాగానే తొందరపడి పోకండి, చదువు కన్నా ఆరోగ్యం ముఖ్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి.