కట్టుదిట్టంగా ‘ఎంసెట్’..

by Anukaran |   ( Updated:2020-09-08 23:21:20.0  )
కట్టుదిట్టంగా ‘ఎంసెట్’..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొద్దిసేపటి కిందటే EAMCET ఇంజినీరింగ్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్ష కొనసాగనుంది. ఎంసెట్ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో 79, ఏపీలో 23 సెంటర్లను ఏర్పాటుచేశారు. 10, 11, 14 తేదీల్లో మిగతా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ గంటన్నర ముందే అభ్యర్థులను లోనికి అనుమతించగా, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా హాల్‌లో శానిటైజర్‌, మాస్కులు తప్పనిసరి అనే నిబంధన పెట్టడంతో అభ్యర్థులంతా వెంట తెచ్చుకున్నట్లు సమాచారం. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో అగ్రి అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed