విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి దసరా సెలవులు

by Anukaran |   ( Updated:2021-10-05 01:51:28.0  )
Public Schools
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఆన్‌లైన్ తరగతులే తప్ప ప్రత్యక్ష బోధన తరగతులు జరగలేదు. కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరిగి సెప్టెంబర్ 1న ప్రత్యక్ష బోధన తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు అందించింది. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఈ నెల 6వ తేదీ నుంచి 17 తేది వరకు దసరా సెలవులు ప్రకటించింది. ఇక మళ్లీ తిరిగి ఈ నెల 18న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఈనెల 13 నుంచి 18 వ తేదీ వరకూ జూనియర్, డిగ్రీ కాలేజీలకు సెలవులు ఉండనున్నాయి.

Advertisement

Next Story