- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
16 ఏండ్ల తర్వాత దొరికిన ‘గణపతి ప్రతిమ’
దిశ, వెబ్‌డెస్క్ : ఓ మహిళ.. 2005లో రైలు ప్రయాణం చేస్తుండగా బంగారు ఆకుతో ఉన్న గణపతి ప్రతిమను పోగొట్టుకుంది. అయితే 16 ఏళ్ల తర్వాత రైల్వే పోలీసులు సదరు ప్రతిమను ఆ మహిళకు అందజేయడం విశేషం. కాగా ఇన్నేళ్ల తర్వాత తన గణపతి ప్రతిమను గుర్తించి ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆమె.. రైల్వే పోలీసులు తనకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చారని పేర్కొంది.
మహారాష్ట్రలోని రాయిగఢ్ జిల్లా, మంగన్ టౌన్‌కు చెందిన రేష్మ అమృతే.. 2005లో థానే మీదుగా ఓ సబ్ అర్బన్ ట్రైన్‌లో ప్రయాణించింది. ఆ ట్రైన్ జర్నీలో తనకు అత్యంత ఇష్టమైన బంగారు ఆకుతో ఉన్న గణపతి ప్రతిమను పోగొట్టుకుంది. తను సెంటిమెంట్ అయిన ప్రతిమ పోవడంతో బాధపడిన ఆమె.. ఎలాగైనా వెతికివ్వాలని రైల్వే పోలీసులను కోరింది. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పటి విచారణ సంగతి తెలియదు కానీ, ఇటీవలే రైల్వే పోలీసులు ఆ ఫిర్యాదుపై విచారణ చేపట్టగా.. వారికి ఓ ప్రతిమ దొరికింది. అది రేష్మకు చెందిందేనని కన్ఫర్మ్ చేసుకుని, కంప్లైంట్‌లో ఉన్న అడ్రస్ ఆధారంగా దివ అనే టౌన్‌కు వెళ్లగా ఆమె అక్కడ లేదు. ఆధార్ రికార్డ్స్‌లో న్యూ అడ్రస్ ప్రకారం.. ఆమె మంగన్ టౌన్‌లో ఉన్నట్లు కనుగొన్నామని, చివరకు తనకు గణేశ్ ప్రతిమను అందజేశామని రైల్వే పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.జి. ఖడ్కికర్ తెలిపారు. కాగా, ఈ గణేశ్ ప్రతిమ 5.80 మిల్లిగ్రాముల బరువు ఉంది. అప్పట్లో దీని విలువ రూ.400 ఉండగా, ప్రజెంట్ రూ.25,000 వరకు ఉంటుందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.