నకిలీ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరెస్టు..

by Anukaran |   ( Updated:2020-08-29 11:44:47.0  )
నకిలీ ట్రాఫిక్ కానిస్టేబుల్ అరెస్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో శనివారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. ప్రవీణ్ అనే వ్యక్తి తాను ట్రాఫిక్ కానిస్టేబుల్ అని చెప్పుకుంటూ గత కొద్దిరోజులుగా ఆటో కార్మికుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని ఆటో కార్మికుల యూనియన్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను పోలీసు కాదని, గతంలో ఆటోడ్రైవర్‌గా పని చేసినట్లు వెల్లడైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story