తమిళ ప్రజలకు సారీ చెప్పిన దుల్కర్ సల్మాన్

by Shyam |
తమిళ ప్రజలకు సారీ చెప్పిన దుల్కర్ సల్మాన్
X

దిశ వెబ్ డెస్క్: మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్ హీరోగా ఇటీవల వచ్చిన చిత్రం ‘వారణే అవశ్యముండే’. ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విడుదలై విజయం సాధించింది. అయితే.. ఈ సినిమాను ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని చూసిన తమిళ ప్రేక్షకులు దుల్కర్ సల్మాన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ను అవమానించేలా ఉందని పలువురు తమిళ ప్రేక్షకులు ఆరోపించడంతో పాటు, దుల్కర్ క్షమాపణలు చెప్పాలని వాళ్లు కోరారు. దీంతో దుల్కర్‌ సల్మాన్‌ తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.

'మ‌మాన‌టి' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇటీవలే దుల్కర్ హీరోగా వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే దుల్క‌ర్ న‌టించి, నిర్మించిన చిత్రం 'వారణే అవ‌శ్య‌ముండు‌'. సురేష్ గోపీ, శోభ‌న కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. నెట్ ఫ్లిక్స్ లో తాజాగా విడుదలైన ఈ చిత్రంపై తమిళులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ను అవమానించేలా సన్నివేశాలున్నాయని, త‌మ మ‌నో భావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, హీరో కావాల‌నే త‌మ‌ని అవ‌మానించాడ‌ని త‌మిళ వ‌ర్గాలు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తుండటంతో… దుల్క‌ర్ స్పందించారు. ఈ చిత్రంలోని ఆ స‌న్నివేశాన్ని ఉద్దేశ్య పూర్వ‌కంగా చేయ‌లేద‌ని, 1988లో వచ్చిన మలయాళ చిత్రం ‘పట్టణ ప్రవేశం’ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని రిఫరెన్స్ గా తీసుకుని రూపొందించామన్నారు. మీమ్స్‌గా కూడా అది ఫేమస్ అని, ఆ స‌న్నివేశం బాధించి వుంటే క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని ట్విట్ట‌ర్ ద్వారా డుల్కర్ వెల్లడించారు. నా సినిమాల ద్వారా, మాటల ద్వారా నేను ఎవరినీ కించపరచాలని చూడనని, నాతో పాటు కుటుంబాన్ని కూడా దూషించడం చాలా బాధగా అనిపిస్తుందని డుల్కర్ ఈ సందర్భంగా అన్నారు. ట్వీట్ కు జతగా మ‌ల‌యాళ చిత్రం 'ప‌ట్ట‌ణ ప్ర‌వేశం' చిత్రంలోని ఓ స‌న్నివేశాన్ని షేర్ చేశారు.

tags :dulquer salmaan, sorry, twitter, tamilians, troll, ltte prabhakaran

Advertisement

Next Story

Most Viewed