- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కే పరీక్ష పెట్టిన చిరంజీవి
దిశ, వెబ్‌డెస్క్: “నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కానీ లక్షణాలు లేవు. క్వారంటైన్‌లో ఉన్నాను. నాలుగైదు రోజుల్లో నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి” అని మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనతో ఇప్పుడు ప్రగతి భవన్ పెద్దలకు గుబులు పట్టుకుంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, ఎంపీ సంతోష్ కుమార్‌ను, తోటి నటుడు అక్కినేని నాగార్జునతో కలిసి, పలువురు టీఆర్ఎస్ నేతలను చిరంజీవి కలుసుకున్నారు. ఇప్పుడు వారందరికీ చిరంజీవి పరీక్ష పెట్టారు. కేసీఆర్, నాగార్జున సహా చిరును కలిసినవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోక తప్పలేదు. కరోనా పరీక్ష చేయించుకుంటారా? లేక ఇప్పటికే చేయించుకున్నారా? ఇదీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ.
కొవిడ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆ వ్యక్తితో సంబంధాల్లో ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారమూ ఇది తప్పనిసరి. రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ప్రతీరోజు నిర్వహిస్తున్న పరీక్షల్లో దాదాపు సగానికి పైగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులకు చేస్తున్నవే. ఈ ప్రకారం.. రెండ్రోజుల మెగాస్టార్ చిరంజీవి సీఎం కేసీఆర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో సహా ప్రగతి భవన్‌లో ఆయనను కలిసినవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదా చేయించుకోవడం తప్పనిసరి.
మాస్కు లేకుండానే ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ
చిరంజీవికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వార్త బయటకు రావడంతో ప్రగతి భవన్‌లోని చాలా మందికి గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. కొవిడ్ నిబంధనల ప్రకారం… ప్రతీఒక్కరూ మాస్కు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. కానీ ప్రగతి భవన్‌కు మాత్రం ఈ నిబంధనలు వర్తించకపోవడంతో బాంబు లాంటి వార్తనే వినాల్సి వచ్చింది. ప్రగతి భవన్‌కు వెళ్ళి కోటి రూపాయలు చెక్కు అందించిన సమయంలో అటు చిరంజీవి మాస్కు పెట్టుకోలేదు… అందుకున్న కేసీఆర్ కూడా మాస్కు పెట్టుకోలేదు. వారిద్దరి మధ్య ఆరడుగుల సోషల్ డిస్టెన్స్ నిబంధన కూడా అమలుకాలేదు. దీంతో సీఎం కేసీఆర్ తప్పక కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.