'బాహుబలి'నే భయపెట్టిన కరోనా

by Shyam |
బాహుబలినే భయపెట్టిన కరోనా
X

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్ లాంటి దేశాల్లో కోవిడ్ -19 ప్రభావం అధికంగా ఉండగా… దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారు. కాగా మనదేశంలో హైదరాబాద్, ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు నివారణ చర్యలపై ప్రచారం చేస్తున్నారు. దీంతో మాస్క్‌లు ధరిస్తున్న ప్రజలు… పబ్లిక్ ప్లేస్‌లలో తిరిగేందుకు ఆలోచిస్తున్నారు.

అయితే కోవిడ్ -19 బాహుబలిని కూడా భయపెట్టింది. అందుకే రెబల్ స్టార్ ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపించాడు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బాహుబలి… కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మాస్క్ వేసుకుని జాగ్రత్త తీసుకున్నాడు. దీంతో అభిమానులు సైతం తమ హీరోను ఫాలో అయిపోతున్నారు. ప్రభాస్ మాస్క్ పెట్టుకుని… మనకు సందేశాన్నిచ్చారంటున్నారు ఫ్యాన్స్. ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించాలని కోరుతున్నారు. అంతేకాదు మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం కూడా చేపడతామని చెబుతున్నారు.

Tags: Bahubali, Prabhas, Corona Virus

Advertisement

Next Story