- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే తొలి గ్రీన్ మాస్క్.. ఎక్కడుందో తెలుసా..?
దిశ, ఫీచర్స్: దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) ఇటీవలే ఓ మాస్క్ నిర్మించగా, యూఎస్ గ్రీన్ బిల్డింగ్స్ కౌన్సిల్ (USGBC) నుంచి 83 పాయింట్లతో లీడర్‌షిప్ ఫర్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ (LEED v4) ద్వారా ప్లాటినం రేటింగ్ అందుకుంది. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘గ్రీన్ మాస్క్’గా నిలిచింది.
హత్తాలో నిర్మితమైన ఈ మసీదు 1050 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ఒకేసారి 600 కంటే ఎక్కువ మంది భక్తులకు ఇక్కడ వసతి కల్పించవచ్చు. మసీదులో 25 మీటర్ల ఎత్తైన మినార్ ఉండగా, గ్రీన్ చార్జర్ స్టేషన్ ఉండటం విశేషం. ఇది దాదాపు 26.5 విద్యుత్ శక్తిని, 55 శాతం నీటిని ఆదా చేస్తుంది. సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెల్స్ కూడా ఇన్‌స్టాల్ చేస్తుండగా, వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఇది వినియోగించిన నీటిని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి, గాలి శుద్దీకరణ కోసం అత్యంత సమర్థవంతమైన పరికరాన్ని ఉపయోగించడం ద్వారా అక్కడికక్కడే గాలి నాణ్యత మెరుగుపడుతుందని, ఇది మసీదు లోపల స్థిరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుందని DEWA తెలిపింది.
‘LEED ప్లాటినం ధృవీకరణను స్వీకరించడం వల్ల మసీదు అన్ని అంతర్జాతీయ స్థిరత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు అర్థం. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో UAE ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుంది. నివసించడానికి ప్రపంచంలోనే అత్యుత్తమైన ప్రదేశంతో దుబాయ్‌ను తీర్చిదద్దేందుకు మేం కృషి చేస్తున్నాం. ఈ మాస్క్ కూడా అందుకు దోహదపడనుంది’ అని డీఈడీఏ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సయీద్ మహ్మద్ అల్ తాయర్ పేర్కొన్నాడు.