సంగీత గురువుకు..స్వర నివాళి

by Shyam |
సంగీత గురువుకు..స్వర నివాళి
X

పంజా వైష్ణవ్ తేజ్..మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న మరో హీరో. ‘ఉప్పెన’ సినిమాతో గ్రాండ్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా పోస్టర్స్, ఫస్ట్ వేవ్ ఆకట్టుకోగా..త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న దేవీశ్రీ ప్రసాద్..తన గురువు, కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ కంపోజర్ మాండోలిన్ శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకుని ఓ ప్రకటన చేశారు. ఉప్పెన ఫస్ట్ సింగిల్‌‌ను గురువు గారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాటను మార్చి 2న సా. 04.02 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్ డే గ్రేటెస్ట్ గురు’ అంటూ మాండోలిన్ శ్రీనివాస్‌ను స్మరించుకుంటూ పోస్ట్ పెట్టారు దేవి. మ్యూజిక్ మ్యాస్ట్రో, లెజెండ్ అయిన మీరు నేర్పిన సంగీత పాఠాలకు రుణం తీర్చుకోలేనంటూ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story