- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఆబ్కారీ అధికారులకు బిగుస్తున్న ఉచ్చు
దిశ, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. గతంలో జారీ చేసిన ఆదేశాల మేరకు సోమవారం ఈ కేసులో సిట్ బృందానికి నేతృత్వం వహించిన ఎక్సైజ్ అధికారి శీలం శ్రీనివాస్ రావు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. కేసు దర్యాప్తులో వెల్లడైన అంశాలను ఆయన ఈడీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ విచారణకు హాజరుకావాలని మరికొందరు ఆబ్కారీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. డ్రగ్స్ వ్యవహారంలో భారీ ఎత్తున నల్లధనం చేతులు మారినట్లు వెల్లడైనా ఎందుకు నిర్లక్ష్యం వహించారన్న విషయంపై ఈడీ ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.
విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 22 వరకు ఈడీ విచారణ కొనసాగనున్నది. డ్రగ్స్ కొనుగోలుకు డబ్బులను అక్రమమార్గంలో విదేశాలకు తరలించినట్లు అనుమానిస్తున్న మరో 50 మందికి కూడా ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. తొలి రోజు మంగళవారం నాటి విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరుకానున్నారు. అక్టోబర్ 2న చార్మీ కౌర్, 6న రకుల్‌ప్రీత్‌సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్‌ఖాన్, 17న తనీష్, 20న నందు, 22న తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ తో పాటు ఇతర విషయాలపై కూడా ఈడీ విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.
సంకటంలో ఆబ్కారీ అధికారులు..
డ్రగ్స్ కేసులో ఆబ్కారీ అధికారులు 12 కేసులు నమోదు చేసి 11 ఛార్జీషీట్లు దాఖలు చేశారు. అయితే అందులో ఎక్కడా గతంలో విచారణను ఎదుర్కొన్న సినీతారల పేర్లు లేవు. సినీ తారలతో పాటు మొత్తం 62 మంది అనుమానితుల నుంచి వెంట్రుకలు, గోర్లు, రక్తం నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ల్యాబ్ కు పంపినప్పటికీ పరిశీలనలో ఏమి తేలిందనే విషయాన్ని ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగడం ఆబ్కారీ శాఖకు సంకటంగా మారింది. అసలు ఇప్పటి వరకు ఆబ్కారీ గుప్పెట్లో ఉన్న గుట్టు ఈడీ విచారణతో రట్టు కానున్నది. వాస్తవానికి డ్రగ్ స్మగ్లర్లు కెల్విన్, రాఫెల్ ఎలెక్స్ముఠాలను అరెస్ట్‌చేశారు. కానీ లోతైన దర్యాప్తు చేయకుండా చేతులు దులుపుకున్నారు.ఆ సమయంలో ఎక్త్సెజ్ కమిషనర్ గా అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. ఆ తర్వాత ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ’వంటి సంస్థల ఆందోళన, కోర్టు జోక్యంతో డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.