రోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వాసుపత్రి.. అవి కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే

by Shyam |
రోగులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వాసుపత్రి.. అవి కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే
X

దిశ, పోచమ్మ మైదాన్: చికిత్స కోసం వస్తోన్న రోగులకు వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ చుక్కలు చూపిస్తోంది. కాళ్లు, చేతులు విరిగి వైద్యం చేయించుకొనేందుకు వచ్చినవారికి కనీస వసతులు కూడా కరువయ్యాయి. గురువారం ఎంజీఎంను సందర్శించిన దిశ రిపోర్టర్ కొన్ని సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారు. అందులో ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఓపీ విభాగంలో తోపుడు బండ్లు, స్ట్రెచర్లు లేక పేషంట్లు అవస్థలు పడుతున్నారు. అవి లేక పేషంట్లను వారి బంధువులే భుజాన మోసుకొని డాక్టర్ల వద్దకు తీసుకొస్తున్నారు.

తోపుడు బండ్లు, స్ట్రెచర్లు కావాలని సిబ్బందిని అడగగా, పైసలిస్తేనే వస్తామని దురుసుగా బదులిస్తున్నారు.పైసల కోసం వాటిని దాచిపెడుతున్నట్లు కూడా ఆరోణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఓపీ రాయించుకోవడానికి వచ్చిన వారు భౌతిక దూరం పాటింపచేయడంలో ఎంజీఎం అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏదిఏమైనా ఎంజీఎంలో తోపుడు బండ్లు, స్ట్రేచర్లు పుష్కలంగా ఏర్పాటుచేసి పేషంట్ల కు బాసటగా నిలవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఎంతైనా ఉంది.

Advertisement

Next Story