పాక్‌లోని ఇండియన్ ఎంబసీపై డ్రోన్ సంచారం

by Shamantha N |
పాక్‌లోని ఇండియన్ ఎంబసీపై డ్రోన్ సంచారం
X

ఇస్లామాబాద్‌: జమ్ములోని ఎయిర్ బేస్‌పై ‘డ్రోన్ దాడి’ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే మరోవైపు ఇలాంటి తరహా ఘటనలే పునరావృతమవుతున్నాయి. తాజాగా, పాక్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్ సంచారం కలకలం రేపుతున్నది. ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమిషన్ కాంపౌండ్ వద్ద డ్రోన్ సంచరించినట్టు తెలిసింది. ఈ చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది భద్రతా ఉల్లంఘన చర్యేనంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, గత ఆదివారం నాటి డ్రోన్ ఘటన పాక్ సాయంతోనే జరిగి ఉండొచ్చని శ్రీనగర్‌లోని ‘15 కార్ప్స్’కు చెందిన కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాకుండా ఆ ఘటనలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలూ ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed