- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా ప్రొడక్షన్లో రవితేజ, సేతుపతి మల్టీస్టారర్?
దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్.. హీరోగానే కాదు నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో రీమేక్‌లపై కూడా దృష్టిపెట్టిన ఆయన.. తండ్రి చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మరోవైపు మలయాళం బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న చెర్రీ.. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఈ మల్టీస్టారర్ మూవీ చేస్తారనే టాక్ కూడా వినిపించింది. అయితే కొత్తగా మరో ఇద్దరు హీరోల పేర్లు తెరమీదకి వచ్చాయి. చెర్రీ, పవన్ కాకుండా మాస్ మహరాజ్ రవితేజ, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి ఈ సినిమా చేయబోతున్నారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం గురించి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా.. ఒరిజినల్ ఫిల్మ్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్స్ ప్లే చేశారు. జీన్ పాల్ లాల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాకు సాచి స్క్రీన్‌ప్లే అందించగా, రూ.4.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 39 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.