హరితహారం తర్వాత హరిస్తున్నారా?

by Shyam |
హరితహారం తర్వాత హరిస్తున్నారా?
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అమలు విషయంలో అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటిని సంరంక్షించాలని పిలుపునిచ్చారు. కానీ, ఆ తర్వాత వాటి ఊసే ఎత్తడం లేదని చెప్పాలి. ప్రభుత్వ శాఖలు, అధికారులు హరితహారం కార్యక్రమం రోజే హడావిడి చేసి తర్వాత మర్చిపోతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కలు ఎండిపోతున్నాయి.. తాజాగా హైదరాబాద్‌లోని రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రధాన కార్యాలయంలోనే వివిధ మొక్కలు వృథాగా పడిపోయి కనిపిస్తున్నాయి. మరో వైపు ఆ శాఖ మంత్రి సహా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టణ ప్రగతిలో భాగంగా హరితహారంలో భాగంగా మొక్కలునాటాలని, పర్యావరణాన్ని కాపాడాలంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు.

tag: dried plant, Irrigation office, Haritha Haram, hyderabad

Advertisement

Next Story

Most Viewed