- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్న వెంటిలేటర్ల తయారీకి సిద్ధమైన డీఆర్‌డీవో, ఐటీఐ!
దిశ , వెబ్‌డెస్క్: భవిష్యత్తు అవసరాల కోసం దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలు డీఆర్‌డీవో, ఐటీఐలు చిన్న వెంటిలేటర్ల తయారీ ఒప్పందానికి సిద్ధమయ్యాయి. ఈ వెంటిలేటర్ల తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగ పరిశోధనా సంస్థ డీఆర్‌డీవో అందించనుంది. అలాగే, వీటి ఉత్పత్తిని మరో రెండున్నర సంవత్సరాల్లో ఐటీఐ మొదలుపెట్టనుంది. వీటి తాయారీకి సంబంధించి ఒప్పందాన్ని మరో రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు ఐటీఐ ఛైర్మన్, ఎండీ అగర్వాల్ చెప్పారు.
చిన్న వెంటిలేటర్ల తయారీ కోసం కావాల్సిన విడిభాగాల్లో 80-90 శాతం దేశీయంగానే సమీకరించి అందిస్తామని, మిగిలిన వాటిని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వీటి ఉప్తత్తి మొత్తం బెంగళూరులో జరుగుతుందని, ప్రస్తుతమున్న వెంటిలేటర్ల కంటే తక్కువ ధరల్లో వీటిని సరఫరా చేస్తామని, డిమాండ్‌ను బట్టి వీటి ధరలు ఇంకా తగ్గొచ్చని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 57,000 వెంటిలేటర్లు ఉంటే, వాటి ధర రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకూ ఉన్నాయి. ఇప్పటివరకూ నిపుణుల అంచనా ప్రకారం దేశంలో కరోనా మరింత విజృంభిస్తే మే రెండో వారం నాటికి లక్ష నుని 2 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయని చెబుతున్నారు.
Tags: Business, Coronavirus, Covid-19, DRDO, Health, India, ITI