ఈ విషయం తెలిస్తే.. మీరు ఎల్బీనగర్‌లో నీళ్లు తాగరు!

by Shyam |
ఈ విషయం తెలిస్తే.. మీరు ఎల్బీనగర్‌లో నీళ్లు తాగరు!
X

దిశ, ఎల్బీనగర్​: అసలే వర్షాకాలం.. ప్రజలు అనారోగ్యం బారిన పడేందుకు వీలున్న సమయం. దీనికి తోడు కాలనీల్లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైపులైన్​ నిండిపోయి ఇళ్లలోని మంచినీళ్లలో కలుస్తున్న దుస్థితి. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు జీహెచ్​ఎంసి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని పరిస్థితి. ఈ పరిస్థితి గతకొన్ని రోజులుగా ఎల్బీనగర్​ నియోజకవర్గంలోని మన్సురాబాద్​ డివిజన్​, వినాయకనగర్​ కాలనీ, రోడ్డు నెం .32లో నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. మన్సురాబాద్​ డివిజన్​, వినాయకనగర్​ కాలనీలో గత కొద్ది కాలంగా డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నిండిపోయి ఇళ్లల్లో ఉన్న మంచినీటి సంపుల్లోకి ప్రవహిస్తుంది. దీంతో కొంతమంది కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇళ్లల్లోని సంపులో మంచినీటిని వినియోగిస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నాసందర్భాలు ఉన్నాయని వారు ఆవేనద వ్యక్తంచేస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, సిబ్బందికి విన్నవించినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్​ అధికారులు స్పందించి కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story