- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న తండ్రి.. వైరల్ అవుతున్న'గే' కుమారుడి పెళ్లిలోని ప్రసంగం
దిశ,వెబ్‌డెస్క్: నాన్నంటే బాధ్యత.. నాన్నంటే భరోసా.. నాన్నంటే త్యాగం.. నాన్నంటే గౌరవం.. నాన్న ఓ మంచి ఫ్రెండ్.. అందుకే ప్రతి బిడ్డ ఆనందం, విజయం వెనుక తండ్రి ఎప్పుడూ ఉంటాడు’ అని మరోసారి నిరూపించాడో తండ్రి. భారత్ లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ డాక్టర్. అయితే విజయ్.., కుమారుడైన ‘గే’ లక్షణాలున్న కొడుకు పరాగ్ మెహతాకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా విజయ్ మెహతా తనకొడుకు గురించి ప్రసంగించారు. ఆ ప్రసంగం నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో తనకొడుకు ఓ రోజు తమతో ‘గే’ అని చెప్పినప్పుడు ఓ డాక్టర్ గా తాను ఎలా రియాక్ట్ అయ్యారో, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగిందో వివరించారు.
1997లో ప్రపంచంలో నాకంటే అత్యంత అదృష్టవంతుడు లేడని అనుకున్నా. నా కొడుకు చదువులోనూ, అన్నీ రంగాలతో పాటూ రోమియో పాత్రలో బాగా నటించి నన్ను మోసం చేస్తాడని అనుకోలేదు. ఒక్కటి మాత్రం నిజం నాకొడుకు రోమియో జూలియట్ పాత్రలో చాలా చక్కగా నటించాడు. అంటే దానర్ధం మా వాడిలో అబ్బాయి- అమ్మాయిలా రెండు షేడ్లు ఉన్నాయి కదా అందుకు. వాడిది కల్ముషం లేని మనస్సు. ఏదైనా చేయగలగుతాడు. తన సన్నిహితుల పట్ల ఎంతో కృతజ్ఞతగా ఉంటాడు. అన్నీ స్వభావాలున్న మనుషుల్ని ప్రేమిస్తాడు. భరతనాట్యం డ్యాన్స్ చేస్తాడు. మంచి వక్త. అందుకే దేవుడు నా మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా ఇలాంటి కొడుకును నాకు బహుమతిగా అందించాడు. కానీ ఎప్పుడైతే మన టైమ్ బాగుందని అనుకుంటామో అదే సమయంలో మనకు బ్యాడ్ టైమ్ నడుస్తుంటుంది.
2019, మార్చి 27న నా కొడుకు మాతో కొద్దిసేపు ఇలా మాట్లాడాడు. అమ్మా, నాన్న నేను ‘గే’ని. ఆ విషయం నాకు 10 ఏళ్ల వయస్సులో తెలిసింది. చాలా కంగారు పడ్డాను. అయోమయానికి గురయ్యాను. మీరు ఇబ్బంది పడతారని నేను చనిపోయే వరకూ ఆ విషయాన్ని మీకు చెప్పొద్దని అనుకున్నా. అందుకే స్కూల్ డేస్ లోనే ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాను. అంతేకాదు గతవారం ఇండియాకు చెందిన నా క్లాస్మెట్ తో నేను గే అని అస్పష్టంగా చెప్పాను. అ విషయాన్ని మీకు బయటవాళ్లు చెప్పేకంటే ముందుగా మీకే చెబుతున్నా’ అని తనలో గే లక్షణాలున్నాయని కొడుకు చెప్పడంతో అప్పటి వరకు మేం సంతోషంగా ఉన్న క్షణాలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి.
ఒక డాక్టర్ వృత్తిలో ఉండి నేను స్వలింగ సంపర్కులంటే నాకు చాలా అసహ్యం. నా కొడుకు చెప్పిన మాటలతో షాక్ అయ్యాను. నేను డాక్టర్ ను. అమెరికాలోనే అతిపెద్ద ఆస్పత్రులలో మంచి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చని, అది పెద్ద సమస్య కాదని, కొడుకులో ఉన్న లక్షణాన్ని మార్చేలా ట్రీట్మెంట్ చేయోచ్చని, వెంటనే నా మెడికల్ లైబ్రరీలో గత 5ఏళ్లుగా ఉన్న ఆర్టికల్స్ అన్నీ చదివాను. అరగంట తర్వాత సడెన్ గా 1973లో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్వలింగ సంపర్కం అనేది జబ్బు కాదని, లోపం కాదని, అలా అని దాన్ని నయం చేయలేమని, అంటు వ్యాధి కాదని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నట్లు పెళ్లిలో తన గతం తాలూకు చేతు అనుభవాల్ని పెళ్లికి వచ్చిన పెద్దలతో పంచుకున్నారు.
అదే సమయంలో మీరు నన్ను అడగొచ్చు. మీ అబ్బాయి గే కాకపోతే ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారా అంటే.. కాదు. నార్మల్ గా ఉన్న కొడుకును 4.24 పర్సెంట్ ప్రేమిస్తే గే అయిన పరాగ్ జైన్ ను 4:31 ప్రేమిస్తానంటూ అందరి హృదయాల్ని గెలుచుకున్నాడు డాక్టర్ విజయ్. ఇక ఫ్లాష్ బ్యాక్ లో తన కొడుకు గే అన్న విషయం అని చెప్పిన తర్వాత పరిపరివిధాలా ఆలోచించా. కొడుకు కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు. ఆ తర్వాత గే లక్షణాలున్న 50మందికి ధైర్యం చెప్పేందుకు వారికి లెటర్లు రాశాను.
చివరగా నాకొడుకు గే అని తెలిస్తే 100 మందిలో 50మంది నాతో మాట్లాడడం మానేస్తారేమో… మిగిలిన 50 మంది మాట్లాడకపోతే మిగిలిన 50 మందితో నువ్వు మాట్లాడు. ఎవరైతే నీ వెంట ఉంటారో వాళ్ల బాగుకోసం ఆలోచించు విజయ్ అంటూ తనని తాను సమర్ధించుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఓ గే’కి తండ్రి అని గర్వంగా మీ ముందు నిలబడ్డానని తన అనుభవాల్ని అందరితో పంచుకున్నాడు.
ఘనంగా పరగాజైన్ – వైభవ్ జైన్ ల వివాహం
జైన్ కుటుంబానికి చెందిన డాక్టర్ విజయ్ ఏ మెహతా తన కుమారుడైన పరాగ్ మెహతాకు 2019లో అమెరికాలో వైభవ్ జైన్ కు ఇచ్చి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి జరిపించారు. ఆ పెళ్లి ఫోటోలు, తండ్రి విజయ్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.