- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖమ్మంలో పాజిటివ్.. గాంధీలో నెగిటివ్
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం కొత్తగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇందులో ఖమ్మం జిల్లాలోని ప్రముఖ డాక్టర్ శంకర్‌నాయక్ ఫస్ట్ కాంటాక్ట్ ద్వారానే సక్రమించినట్టుగా వైద్యులు ప్రకటించడం గందరగోళానికి తెరలేపుతోంది. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుకు పాజిటివ్ రావడంతో ఆయన ఫస్ట్ కాంటాక్టు లిస్ట్‌లో డాక్టర్ శంకర్‌నాయక్ ఉండటంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ఆరు రోజుల క్రితం కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. వెంటనే గాంధీలో చేరిన ఆయనకు, ఆయన సతీమణికి, 40 మంది తన ఆస్పత్రి సిబ్బందికి అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చినట్టుగా తెలిపారు. దీంతో ఆయన మూడ్రోజుల క్రితం ఖమ్మంలోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న కరోనా వైద్య పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ డీఎంహెచ్‌వో పనితీరుపై కలెక్టర్ కర్ణన్‌కు ఆదివారం స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. కరోనా పరీక్ష ఫలితాల ప్రకటనలో తప్పులు జరుగుతున్నాయని, డీఎంహెచ్‌వో పనితీరు అధ్వానంగా ఉందని కలెక్టర్ ఎదుటే మండిపడ్డారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఆయనకు కలెక్టర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. శంకర్ నాయక్‌తో కాంటాక్టులో ఉన్న నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని భద్రాద్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందులో ఆయన ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఉండటం గమనార్హం.