రాష్ట్రంలో డీపీవోల బదిలీ

by Anukaran |   ( Updated:2020-07-31 11:04:32.0  )
రాష్ట్రంలో డీపీవోల బదిలీ
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో 18 మంది డీపీఓలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు డీఎల్‌పీఓలకు డీపీఓలకు పదోన్నతి కల్పించారు. సంగారెడ్డి డీఎల్‌పీఓగా పని చేస్తున్న వెంకటేశ్వర్లును అదే జిల్లా డీపీఓగా నియమించారు. రాజేంద్రనగర్ వ్యవసాయాధికారిగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డిని అదేస్థానంలో పదోన్నతిపై బదిలీ చేశారు. జోగుళాంబ గద్వాల డీఎల్‌పీవో కృష్ణను అదే జిల్లాలో డీపీఓగా, నిజామాబాద్ డీఎల్‌పీఓ శ్రీకాంత్‌ను రంగారెడ్డి డీపీఓగా బదిలీ చేశారు.

రంగారెడ్డి డీపీఓ పద్మజను మేడ్చల్ మల్కాజ్‌గిరి డీపీఓగా, పెద్దపల్లి డీఎల్‌పీఓ సుదర్శన్‌ను అదే జిల్లా డీపీఓగా, మెదక్ డీఎల్‌పీఓ హనూక్‌ను మెదక్ డీపీఓగా నియమించారు. జయశంకర్ భూపాలపల్లి డీఎల్‌పీఓ చంద్రమౌళిని ములుగు డీపీఓగా నియమిస్తూ అక్కడి డీపీఓను వెంకయ్యను పీఆర్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎల్‌పీఓ లతను మహబూబాబాద్ డీపీఓగా, వరంగల్ డీఎల్‌పీఓ నారాయణరావును మంచిర్యాల డీపీఓగా, జగిత్యాల డీఎల్‌పీవో శంకర్‌ను అదే జిల్లా డీపీఓగా, నిర్మల్ డీఎల్‌పీఓ శ్రీనివాస్‌ను ఆదిలాబాద్ డీపీఓగా, మంచిర్యాల డీఎల్‌పీవో బుచ్చయ్యను జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీపీఓగా, సూర్యపేట డీఎల్‌పీవో యాదయ్యను అదే జిల్లా డీపీఓగా, జనగాం డీపీఓ వెంకటేశ్వర్ రావును నిర్మల్ డీపీఓగా, వరంగల్ అర్బన్ డీఎల్‌పీఓ లక్ష్మీ రమాకాంత్‌ను భద్రాద్రి కొత్తగూడెం డీపీఓగా, మహబూబాబాద్ డీఎల్‌పీవో రంగాచారిని జనగామ డీపీఓగా, ఆదిలాబాద్ డీఎల్‌పీఓ సాయిబాబాను వరంగల్ అర్బన్ డీపీఓగా, నారాయణపేట డీఎల్‌పీఓ మురళిని అదే జిల్లాలో డీపీఓగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed