- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక సంగీత దిగ్గజం పొన్నమ్మాళ్ ఇక లేరు..
తిరువనంతపురం: శాస్త్రీయ సంగీత ప్రియులను గత ఎనిమిది దశాబ్దాలుగా కొన్ని వందల సంగీత కచేరీలతో అలరిస్తున్న కర్ణాటక సంగీత విదుషీమణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత పరసాల బి.పొన్నమ్మాళ్ (96) ఇక లేరు. కేరళలోని వలియశాలలో ఉన్న స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె మంగళవారం కన్నుమూశారు. సంగీత ప్రపంచంలో పురుషాధిక్యతను సవాలు చేస్తూ 1940 ప్రాంతంలో చారిత్రక స్వాతి తిరునాల్ సంగీత కళాశాలలో చేరిన మొదటి విద్యార్థినిగా ఆమె ఖ్యాతి పొందారు.
గాన భూషణం, గాన ప్రవీణ కోర్సుల్లో మొదటి ర్యాంకులో ఉత్తీర్ణులయిన ఆమె ఆ తర్వాత అదే కళాశాలలో బోధకురాలిగా, ప్రఖ్యాత ఆర్‌ఎల్‌వీ సంగీత, లలితకళల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 2006లో శ్రీ పద్మనాభస్వామి ఆలయ నవరాత్రి ఉత్సవాల్లో గానం చేసిన తొలి మహిళగా కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్న పురుషుల ఆధిక్యతకు గండి కొట్టారు. పద్మశ్రీతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. బి.పొన్నమ్మాళ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.