- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైసెక్సువల్‌గా ప్రకటించిన హీరోయిన్.. ‘హ్యాపీ ప్రైడ్ మంత్’
దిశ, సినిమా: అమెరికన్ యాక్టర్, సింగర్ డేవ్ కామెరూన్ తన ఫస్ట్ ప్రైడ్ మంత్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ‘డిసెండెంట్స్’ ఫిల్మ్ సిరీస్‌లో మాల్ పాత్ర ద్వారా ఫేమ్ పొందిన డేవ్.. 2020 సెప్టెంబర్‌లో తను బైసెక్సువల్ అని ప్రకటించింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఇంతకు ముందే ఈ విషయం తెలుసన్న భామ.. అభిమానులతో లాస్ట్ ఇయర్ షేర్ చేసుకుంది. గే టైమ్స్ ‘సమ్మర్ ఇష్యూ’ మ్యాగజైన్ కోసం చేసిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో కనిపించిన ఆమె.. వింత, అసాధారణం అనేది తనకు ‘మోర్ ఫిట్టింగ్ లేబుల్’ అని తెలిపింది. తాను ఎవరితో డేట్ చేశాననేది ఇంపార్టెంట్ కాదు.. నేను ఎవరు? అనేది పబ్లిక్‌కు తెలియడం ప్రధానమని అభిప్రాయపడింది. సెల్ఫ్ లవ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని, పరిస్థితులను బట్టి తనను తాను ఎడిట్ చేసుకోలేనని చెప్పింది. ఈ విషయంలో క్షమాపణలు చెప్పాలని అనుకోవడం లేదన్న బ్యూటీ.. ప్రజలను మరింత సౌకర్యంగా ఉంచేందుకు భిన్నంగా చెప్పడం లేదని తెలిపింది.
కాగా ఈ ఏడాది ప్రైడ్ మంత్ స్పెషల్‌గా ఉందన్న డేవ్.. ప్రజలు తనకు ‘హ్యాపీ ప్రైడ్ మంత్’ విషెస్ చెప్పడం డిఫరెంట్‌గా ఉందని తెలిపింది. సెక్సువాలిటీ గురించి బయటపెడితే ప్రొఫెషనల్ కెరియర్ దెబ్బతింటుందని భయపడ్డానని, కానీ ఇప్పుడు తన అభిమానులకు స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉందని చెప్పింది. తను ఎవరనే విషయంలో ఎప్పుడూ కన్‌ఫ్యూజన్ లేదన్న డేవ్.. ఇది చెప్తే ప్రజలు నమ్మలేరని మాత్రం భావించానని తెలిపింది.