- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందులో మిగిలింది ఒక్కరే.. ఉద్యోగ నోటిఫికేషన్ సాధ్యమేనా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్తగా 50వేల ఉద్యోగులకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. పూర్తిస్థాయిలో లేని పాలకమండలితో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఒక యాక్టింగ్ చైర్మన్, ఒక సభ్యుడితో మాత్రమే టీఎస్‌పీఎస్సీ పాలక మండలి కొనసాగుతోంది. యాక్టింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బి. కృష్ణారెడ్డి ఈ నెల 18న పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో కమిషన్‌లో ఒకే ఒక సభ్యుడు చింతా సాయిలు మాత్రమే ఉండనున్నారు. ఒక్కరితో కమిషన్ ద్వారా కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రశ్నార్థకమే..
నిబంధనల ప్రకారం.. కమిషన్ పాలకమండలిలో ఒక చైర్మన్‌తో పాటు పది మంది సభ్యులుగా ఉండాలి. రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్పీఎస్పీ ఏర్పాటైంది. ఈ కమిషన్ చైర్మన్‌గా గంట చక్రపాణితో పాటు ముగ్గురు సభ్యులు సి.విఠల్, బి.చంద్రావతి, మహ్మద్ మథీనుద్దీన్ ఖాద్రి 2014 డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌తో పాటు ఆ ముగ్గురు సభ్యులు పదవీ కాలం 2020 డిసెంబర్ 17తో ముగిసింది. మిగిలిన ఏడుగురు సభ్యుల్లో 2017లో టి.వివేక్, 2018లో ఎం.రాజేందర్, సీహెచ్. విద్యాసాగర్ రెడ్డి, 2019 బానాల మన్మథ రెడ్డి, ఈ ఏడాది ఫిబ్రవరిలో కె. రాంమోహన్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఇక మిగిలిన ఇద్దరు సభ్యుల్లో యాక్టింగ్ చైర్మన్ కృష్ణారెడ్డి ఈ నెల 18న (గురువారం) పదవీ విరమణ పొందనున్నారు. దీంతో కమిషన్ సభ్యు్ల్లో చింతా సాయిలు మాత్రమే మిగిలారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.