- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య కేసులో మరో కోణం
దిశ, వెబ్‌డెస్క్: ఘట్‌కేసర్ కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి ఆత్యహత్య కేసులో మరో కోణం వెలుగు చూస్తోంది. బీ ఫార్మసీ విద్యార్ధిని మంగళవారం మధ్యాహ్నం షుగర్ టాబ్లెట్స్ మింగినట్లు తెలుస్తోంది. దీంతో యువతిని గమనించిన కుటుంబసభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కిడ్నాప్ డ్రామా ఘటనతో యువతి డిప్రెషన్‌లో ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. కాగా, ఇవాళ ఉదయం లేవగానే యువతి చనిపోయి కనిపించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో ఫార్మసీ విద్యార్థినికి పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించారు.
ఈ నెల 10వ తేదిన బీ ఫార్మసీ విద్యార్థిని సాయంత్రం కాలేజీ బస్సు నుంచి దిగి ఆటోలో వస్తుండగా.. తనను ఆటో డ్రైవర్లు రూట్ మార్చి తీసుకెళ్లి అత్యాచారం చేశారని తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో యువతి తల్లి ఫిర్యాదుతో కీసర, మల్కాజ్‌గిరి, ఘట్‌కేసర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అమ్మాయి లైవ్ లోకేషన్ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజీగూడ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో చిన్న గాయాలు, చిరిగిన బట్టలతో అమ్మాయి కనిపించింది. ఇదే సమయంలో పోలీసులు అమ్మాయి వద్దకు వెళ్లి ఆరా తీసి మాట్లాడే పరిస్థితిలో లేదు. వెంటనే పోలీసులు పక్కనే ఉన్న మేడిపల్లి క్యూర్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు యువతి కిడ్నా్ప్ డ్రామా ఆడినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థి కిడ్నాప్, అత్యాచారం కేసును తప్పుడు కేసుగా నిర్ధారించినట్లు తెలిపారు.