'RRR' ఫస్ట్ సాంగ్: బడబాగ్నికి, జడివానకు 'దోస్తీ'

by Anukaran |   ( Updated:2021-08-01 01:15:30.0  )
RRR ఫస్ట్ సాంగ్: బడబాగ్నికి, జడివానకు దోస్తీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో వేచి చూసిన వెయిటింగ్ నేటితో ముగిసిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. నేడు స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని దోస్తీ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర , అమిత్‌ త్రివేది , అనిరుధ్‌, యాజిన్‌ నాజిర్, విజయ్‌ ఏసుదాస్‌.. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. ఈ పాట కోసం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలతో సెట్‌ వేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు- కొమరం భీమ్ ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది. రెండు వేర్వేరు దారులలో ప్రయాణించే ఇద్దరు యోధులు.. కానీ ఆ ఇద్దరి లక్ష్యం ఒక్కటే అని ఈ పాట ద్వారా సినిమా కథను దర్శకుడు చెప్తున్నాడు, ఇక చివర్లో రామ్ చరణ్, తారక్ కలిసి రావడం ఈ థీమ్ సాంగ్ కి హైలైట్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా తారక్ కనిపిస్తున్నారు. ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ థీమ్ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed