నిప్పుతో చెలగాటమాడొద్దు: జగ్దీప్ ధన్కర్

by Shamantha N |   ( Updated:2020-12-11 06:35:22.0  )
నిప్పుతో చెలగాటమాడొద్దు: జగ్దీప్ ధన్కర్
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, నిప్పుతో చెలగాటం ఆడొద్దని మమతా బెనర్జీని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణతపై కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నివేదిక సమర్పించారు. సోమవారం తన ఎదుట హాజరుకావాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సమన్లను జారీ చేశారు. ‘ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిపై గురువారం క్రూరమైన దాడి జరిగింది.

ఈ దాడిలో రాష్ట్రానికి చెందిన వ్యక్తులకు సంబంధం ఉన్నది. అల్లరి మూకలకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తి సహాయసహకారాలు అందించింది. ఇది ప్రజాస్వామ్యానికి మరణం వంటింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి నా నివేదికను పంపించాను’ అని గవర్నర్ జగ్దీప్ ధన్కర్ విలేకరులకు తెలిపారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను సమగ్ర నివేదిక‌ను సమర్పించాలని కోరానని, కానీ, ఎలాంటి సమాచారం లేకుండా, నివేదిక రూపొందించుకుండా వచ్చారని తెలిపారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా అఖిల భారతీయ సర్వీసు ఉద్యోగులు. నివేదిక సమర్పించడం నైతిక విధి. నేను నిర్ఘాంతపోయాను. సిగ్గుపడుతున్నాను. ఈరోజు రాజ్యాంగ విధులకు తీవ్రమైన విఘాతం కలిగిన రోజు’ అని గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed