ఆ 4 దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలే!!

by vinod kumar |   ( Updated:2021-03-20 04:33:11.0  )
ఆ 4 దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలే!!
X

దిశ,వెబ్ డెస్క్: ప్రపంచంలో ఎక్కడా ఉండని కఠిన నిబంధలన్ని సౌదీ అరేబియాలో ఉంటాయి. తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఆ దేశ పురుషులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌ దేశాలకు చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకోడానికి వీల్లేదంటూ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఈ మధ్య సౌదీ అరేబియాలో పురుషులు విదేశ యువతులను పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది.

ఇప్పటీకే పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్‌ దేశాలకు చెందిన అమ్మాయిలు సౌదీ లో 5 లక్షలమంది ఉన్నారు. దీంతో వారిని కట్టడి చేయడానికి ఈ నాలుగు దేశాలకు చెందిన యువతులను వివాహమాడితే కఠిన చర్యలు తప్పవంటూ సౌదీ అరేబియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో సౌదీ అబ్బాయిలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక ఒకవేళ ఆ నాలుగు దేశాలకు చెందిన మహిళలను వివాహమాడాలంటే.. ఖచ్చితంగా సౌదీ ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వారి దగ్గర దరఖాస్తు పెట్టుకొని, వారు అనుమతిస్తే తప్ప పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.

Advertisement

Next Story

Most Viewed