ఆ యాప్‌ల మాయలో పడొద్దు: యోగేశ్ దయాల్

by Harish |   ( Updated:2020-12-23 05:05:29.0  )
ఆ యాప్‌ల మాయలో పడొద్దు: యోగేశ్ దయాల్
X

దిశ,వెబ్‌డెస్క్: సులభంగా రుణాలు ఇస్తున్న యాప్‌ల మాయలో పడవద్దని ఆర్బీఐ సీజీఎం యోగేశ్ దయాల్ వెల్లడించారు. రుణ యాప్‌లపై నమోదైన కేసుల అంశంలో ఆయన స్పందించారు. ఆర్‌బీఐ,ఎస్‌బీఎఫ్‌సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని ఆయన సూచించారు. కొన్ని యాప్‌లు, అధిక వడ్డీలు, రుసుములు తీసుకుంటున్నట్టు తెలిసిందని చెప్పారు. వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వవద్దని పేర్కొన్నారు. యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story