విద్యావంతులకే ఓటేయడం తెలియదా..?

by Anukaran |   ( Updated:2020-12-04 01:10:11.0  )
విద్యావంతులకే ఓటేయడం తెలియదా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : విద్యావంతులు వేసే పోస్టల్ బ్యాలెట్‌లోనూ చెల్లని ఓట్లు రావడం విస్మయానికి గురి చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1926 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ 33, బీజేపీ 87, ఎంఐఎం 17, కాంగ్రెస్ 02, ఇతరులు సున్నా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా, 1926 ఓట్లలో 40 శాతం చెల్లని ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఓటు ఎలా వేయాలో అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాళ్లే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రజల చేత ఓట్లు ఎలా వేయిస్తారనే ప్రశ్న సామాన్యుడిలో ఉత్పన్నమవుతోంది.

పోస్టల్ బ్యాలెట్‌లో ఎవరికెన్ని..

జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా అందుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సమాచారం ప్రకారం పోలైన ఓట్లలో ఎక్కువగా చెల్లుబాటు కావడం లేదు. కాప్రా సర్కిల్ పరిధిలో 75 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా.. అందులో 29 చెల్లుబాటు కాలేదు. ఈ సర్కిల్‌లో టీఆర్ఎస్‌కు 18, బీజేపీకి 16, కాంగ్రెస్‌కు రెండు, టీడీపీ రెండు పోస్టల్ ఓట్లు వచ్చాయి. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి పోటి చేస్తున్న చర్లపల్లి డివిజన్‌లో బీజేపీకి ఒక ఓటు రాగా.. ఐదు చెల్లుబాటు కాలేదు. మేయర్ భార్యకు ఒక్క పోస్టల్ ఓటు కూడా రాలేదు. యూసఫ్ గూడ డివిజన్‌లో ఆరు ఓట్లు నమోదవ్వగా.. ఆరు బీజేపీకి, రెండు టీఆర్ఎస్‌కు వచ్చాయి. ఎర్రగడ్డ డివిజన్‌లో ఆరు ఓట్లలో మూడు చెల్లుబాటు కాలేదు. ఇక్కడ రెండు టీఆర్ఎస్‌కు, ఒకటి బీజేపీకి వచ్చాయి. రహమత్ నగర్‌లో 14 ఓట్లకు గాను ఏడు చెల్లుబాటు కాలేదు .టీఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ రెండు, నోటాకు రెండు, బీజేపీ ఒక ఓటు వచ్చాయి. బోరబండలో పోలైన ఒకే ఒక పోస్టల్ ఓటు బీజేపీకి దక్కింది.

Advertisement

Next Story

Most Viewed