మధుత్తరాధి మఠం విరాళం

by Aamani |

దిశ, ఆదిలాబాద్ : సోన్ మండల కేంద్రానికి చెందిన మదుత్తరాది మఠం సభ్యులు కరోనా నివారణకు రూ5లక్షల చెక్కును కలెక్టర్ మహ్మద్ షారుఖీకి శనివారం అందజేశారు. అలాగే భాగ్యనగర్ కాలనీకి చెందిన 26మంది కాలనీ వాసులు, యూత్ సభ్యులు 23వేల500 చెక్కును నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ సమక్షంలో కలెక్టరుకు అందజేశారు. విరాళాలు అందజేసిన వారిని కలెక్టర్ అభినందించారు. అధికార యంత్రాంగానికి ఇది స్ఫూర్తినిస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.

Tags: donations,collector,musharraf Shahrukhi

Advertisement

Next Story

Most Viewed